ఏందిది కేఈ: గన్ను.. బుల్లెట్టు.. చంద్రబాబు

Update: 2017-01-03 05:09 GMT
అవకాశం అన్నిసార్లు రాదు. వచ్చినప్పుడు అస్సలు విడిచి పెట్టకూడదు. తన మాటల వల్ల.. చేతల వల్ల అధినేత గుర్రుగా ఉన్న విషయాన్ని గుర్తించారో ఏమో కానీ.. తన జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రిని తన మాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం.. సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి. తరచూ తన మాటలతో బాబును ఇబ్బంది పెట్టేలా మాట్లాడే కేఈ.. ఈసారి అందుకు భిన్నంగా విపరీతంగా పొగిడేశారు.

తన జిల్లాకు వచ్చిన అధినేత మనసు దోచుకునేందుకు ఆయన నోట సినిమా డైలాగులు పేలాయి. గన్ను పేల్చటం కాదు.. బుల్లెట్ ఎక్కడ దిగిందన్నదే ముఖ్యమంటూ ఒక సినిమాలో డైలాగు ఉందని.. అలానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దూసుకెళుతున్నారని వ్యాఖ్యానించారు. నీళ్లు ఇస్తూ చంద్రబాబు బుల్లెట్ లా దూసుకెళుతున్నారన్న ఆయన.. బాబు అపర భగీరథుడిగా అభివర్ణించారు.

కర్నూలు జిల్లా మచ్చుమర్రి సభలో పలువురు తెలుగు తమ్ముళ్లు మాట్లాడినప్పటికీ.. తనదైన శైలిలో మాట్లాడి.. సినిమా డైలాగులతో బాబును పోల్చేసి.. సరికొత్తగా మాట్లాడిన కేఈ మాటలు అధినేత మనసును దోచుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. తెలుగు తమ్ముళ్లు పలువురు మాట్లాడినా.. కేఈ మాటలు మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉంటూ బాబు దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News