తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత.. రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామిని వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా అభివర్ణిస్తుంటారు. ఆయన నోటి నుంచి వచ్చే మాటలు తూటాల్లా పేలుతుంటాయి. టార్గెట్ చేస్తే చాలు.. ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఆరోపణలు.. ఘాటు విమర్శలు చేసే ఆయన తాజాగా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఇప్పటికే సొంత పార్టీ నేతల తోనే తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయించుకుంటున్న కేజ్రీవాల్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ మోసగాడని.. డొల్ల కంపెనీల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ విరాళాలు తీసుకుంటుందని.. బ్లాక్ మనీని వైట్ గా మార్చటంలో కేజ్రీవాల్ పార్టీకి మించింది లేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత.. మాజీ మంత్రి కపిల్ మిశ్రా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సుబ్రమణ్య స్వామి.. కేజ్రీవాల్‌ను శ్రీ 420గా అభివర్ణించారు.
ఒక పార్టీ అధినేత.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని ఇంత తీవ్రస్థాయిలో విమర్శించటం సంచలనంగా మారింది. కేజ్రీవాల్ అవినీతిపరుడిగా సుబ్రమణ్యస్వామి అభివర్ణించటం ఇది తొలిసారి కాదు. నాలుగేళ్ల క్రితం కేజ్రీవాల్ పేరును శ్రీ420గా మార్చాలంటూ ట్వీట్ చేశారు సుబ్రమణ్యస్వామి. ఇప్పటివరకూ తాను టార్గెట్ చేసిన ఎవరైనా సరే.. చిక్కుల్లో పడేలా న్యాయపోరాటం చేసే ఆయన.. కేజ్రీవాల్ మీద ఉత్త ఆరోపణలు.. విమర్శలకే పరిమితం అవుతారా? లేక.. తనదైన శైలిలో న్యాయపోరాటానికి దిగుతారో చూడాలి.