ఆ రెండు రాష్ట్రాల్లో మాత్రం ఇవాళే పండుగ

Update: 2016-07-06 10:09 GMT
దేశమంతా ఒక దారిన ఉంటే.. రెండు రాష్ట్రాల్లోని ముస్లింలు మాత్రం మరో దారిన నడవటం విశేషంగా చెప్పాలి. నెలవంక కనిపించని కారణంగా బుధవారం జరగాల్సిన రంజాన్ ముగింపు ఉత్సవం.. గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీలోని జామా మసీద్ ఇమామ్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. మరికాసేపట్లో రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవటానికి సిద్ధమైన ముస్లింలు.. ఇమామ్ చేసిన ప్రకటనతో పండుగను వాయిదా వేసుకున్నారు. దీంతో.. పలు సంస్థలు సెలవుల్ని సైతం సవరిస్తే.. మరికొన్ని చోట్ల పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. జమ్మూ కశ్మీర్.. కేరళలో మాత్రం ఈ రోజే రంజాన్ ను నిర్వహిస్తున్నారు. అదెలా అంటే.. నెలవంక తమకు కనిపించిందని.. అందుకే రంజాన్ ను తాము ఈ రోజు చేసుకుంటున్నట్లగా ప్రకటించారు. గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్ గా ఉన్న ముఫ్తీ బషీరుద్దీన్ అహ్మద్ తమకు నెలవంక కనిపించిందని ప్రకటనించిన నేపథ్యంలో కశ్మీర్ లో నేడు రంజాన్ జరుపుకుంటున్నారు. అదే బాటలో కేరళ కూడా నడవటం గమనార్హం. దీంతో.. ఈ రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన దేశమంతా గురువారం రంజాన్ పర్వదినాన్ని జరుపుకుంటోంది.
Tags:    

Similar News