అత్యున్నత స్థానాల్లో ఉన్న వారేం చేయకూడదో సరిగ్గా అవే పనులు చేసే తీరు ప్రధాని మోడీలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి పనే చేసి వార్తల్లోకి ఎక్కారు. సొంత పార్టీ నేతలకు తప్పించి.. ప్రత్యర్థి పార్టీ ముఖ్యనేతల్ని కలుసుకునేందుకు సైతం ఇష్టపడని తీరు ఈ మధ్యన కీలక స్థానాల్లో ఉన్న వారిలో తరచూ కనిపిస్తూ ఉంటుంది.
ప్రధాని మోడీలో ఈ తీరు కాస్త ఎక్కువే. ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రుల్ని కలిసేందుకు మోడీ ఇష్టపడరు. అంతేనా.. ఒకటికి మూడుసార్లు అడిగినా.. తన అపాయింట్ మెంట్ కు నో చెప్పేయటం పీఎంకు ఈ మధ్యన అలవాటైందని చెబుతారు. ఇదే తీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్కువే. తనను కలిసేందుకు వచ్చే విపక్ష నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చే విషయంలో కేసీఆర్ చుక్కలు చూపిస్తుంటారు.
కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం అదే పనిగా ప్రయత్నించి.. ప్రయత్నించి షాకుల మీద షాకులు తిన్న తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు అయితే.. కేసీఆర్ తీరుపై తీవ్రంగా రియాక్ట్ కావటమే కాదు.. ఒక సభలో అయితే కేసీఆర్ ముఖం మీదనే చెప్పేశారు. దీంతో.. బుజ్జగించిన కేసీఆర్ ఆయన్ను ప్రత్యేకంగా తనతో తీసుకెళ్లి ఇంటికి వెళ్లారు.
ఈ మధ్యన మోడీతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కు.. ప్రధాని దర్శనం కాలేదు. విదేశీ పర్యటనకు వెళ్లే హడావుడిలో ఉన్నారంటూ ఆయన అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయ్యింది. అయితే.. అదే రోజు బెంగళూరు రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్ మెంట్ ఇవ్వటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది కేసీఆర్‌కు హర్ట్ చేసినా.. గవర్నర్ నరసింహన్ చొరవతో వారం వ్యవధిలోనే మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వటం.. ఈసారి కచ్ఛితంగా కలుస్తారన్న హామీతో దేశ రాజధానికి వెళ్లారు కేసీఆర్.
తాజాగా ఇందుకు భిన్నమైన అనుభవం కేరళ ముఖ్యమంత్రికి ఎదురైంది. రాష్ట్రానికి కేటాయించాల్సిన రేషన్ కు సంబంధించి అసమానతలు ఉన్నాయని.. వాటిని చర్చించేందుకు తనకు టైమివ్వాల్సిందిగా కేరళ ముఖ్యమంత్రి విజయన్ అడుగుతున్నారు. ఇప్పటికి మూడుసార్లు అపాయింట్ మెంట్ ఇవ్వని ప్రధాని.. నాలుగోసారి సీఎం చేసిన ప్రయత్నాలకు గండి కొడుతూ అపాయింట్ మెంట్ కు నిరాకరించారు.
సీఎం విజయన్ కావాలంటే కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖామంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తో భేటీ కావొచ్చంటూ సూచన చేయటం గమనార్హం. తమ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూల మీద ప్రధాని మోడీని కలిసేందుకు ఎంత ప్రయత్నించినా.. ఎప్పటికప్పుడు తన అపాయింట్ మెంట్‌ను క్యాన్సిల్ చేస్తున్న తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మోడీనా మజాకానా?