అమెరికాలోని మిచిగాన్ లో కేరళ వైద్యుడిని కాల్చి చంపారు. ఆయనను కేరళలోని అలప్పుఝ జిల్లా మావెలికరాకు చెందిన రమేశ్ కుమార్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి ఆయన మృతదేహాన్ని ఆయన కారులో కనుగొన్నామని పోలీసులు వివరించారు. రమేశ్ కుమార్ మిచిగాన్ లోని డెట్రాయిట్ లో హెన్రీఫోర్డ్ దవాఖానలోని యూరాలజీ విభాగంలో పనిచేస్తున్నారు.
రమేశ్ కుమార్ మృతిచెందాడని శుక్రవారం ఉదయం 11.30 గంటలకు మాకు సమాచారం అందింది. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు`` అని మావెలికరాకు చెందిన రమేశ్ బంధువు ఒకరు తెలిపారు. అయితే దీన్ని జాత్యాహంకార దాడిగా భావించడంలేదని మృతుడి తల్లిదండ్రులు చెప్పారు. శవపరీక్ష ముగిసిందని, సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. రమేశ్ కుమార్ తండ్రి నరేంద్రకుమార్ కూడా వైద్యుడే. అమెరికాలో భారతీయ వైద్యుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/