గాడ్స్ ఓన్ కంట్రీగా - ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరొందిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత 9 రోజులగా కేరళ జల దిగ్బంధంలో ఉంది. వరద బీభత్సానికి ఇప్పటివరకు 324మంది చనిపోయారు - 3 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. గడచిన వందేళ్లలో ఈ తరమాలో భారీ వరదలు ముంచెత్తడంతో కేరళ అతలాకుతలమవుతోంది. త్రివిద దళాలు - 51 ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కేరళ వరద బాధితులకు పలువురు సినీ తారలు - సెలబ్రిటీలు - క్రీడాకారులు - రాజకీయ నాయకులు విరాళాలందించారు. మరికొందరు బాధితులకు అండగా నిలవాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేరళ వరద బీభత్సంపై వైసీపీ అధ్యక్షుడు - ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించారు.
కేరళపై ప్రకృతి కన్నెర్రజేసిన సంగతి తెలిసిందే. గత 9 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు కేరళ జలమయమైంది. లక్షలాది మంది సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళలో వరద బాధితులకు జగన్ బాసటగా నిలిచారు. అక్కడి పరిస్థితులు తనను కలచి వేసాయంటూ ఆవేదన చెందుతూ ట్వీట్ చేశారు. కేరళ ప్రకృతి బీభత్సం తన హృదయాన్ని కలిచివేస్తోందని జగన్ అన్నారు. ఈ కష్టకాలంలో తన ప్రార్థనలు - ఆలోచనలు కేరళ ప్రజల వెన్నంటే ఉంటాయని చెప్పారు. ప్రకృతి విలయంతో అతలాకుతలమైన కేరళ ప్రజలకు సహాయ - పునరావాస చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరుతూ జగన్ ట్వీట్ చేశారు.