కేరళ వరదలు.. సెల్ఫీ పిచ్చి పీక్ స్టేజ్ కి..

Update: 2018-08-23 09:55 GMT
సెల్ఫీ.. ఇప్పుడు ఈ పిచ్చి యువతను పట్టి పీడిస్తోంది. ఇటీవలే విహారయాత్రకు వెళ్లిన ఓ దంపతులు తమ కుమారుడిని డ్యామ్ వంతెనపై నిలబెట్టి సెల్ఫీ తీసుకున్నారు. ఈ క్రమంలో కుమారుడు డ్యాంలో పడిపోయిన విషయాన్ని కూడా మరిచిపోయారు. ఇలా సెల్ఫీ పిచ్చి ప్రాణాల మీదకు తెస్తోంది.

తాజాగా కేరళలో వరద సహాయక చర్యలు త్రివిధ దళాలు చురుగ్గా సాగుతున్నాయి.   సైన్యం హెలీక్యాప్టర్లతో వరద బాధితులను ముంపులో ఉన్న ప్రాంతాలనుంచి రక్షిస్తోంది. ఈ క్రమంలోనే ఓ యువకుడు సెల్ఫీ కోసం చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.

వరద ముంపులో ఇళ్లపైన తలదాచుకున్న ప్రజలను రక్షించేందుకు ఓ ఆర్మీ హెలీక్యాప్టర్ వెళుతుండగా.. ఓ యువకుడు ఎర్ర చోక్కాను గాల్లో ఊపుతూ రక్షించమని కేకలు వేశాడు. దీంతో సైనికులు హెలీక్యాప్టర్ ను అతికష్టం మీద  అతడికి సన్నిహితంగా తీసుకొచ్చి తాడువేశారు. కానీ ఆ యువకుడు హెలీక్యాప్టర్ దగ్గరకు రాగానే తన మొబైల్ నుంచి ఫోన్ బయటకు తీసి సెల్పీ తీసుకున్నాడు. ఫొటో అయిపోగానే ఇక వెళ్లిపోవచ్చని హెలీక్యాప్టర్ లోని సైనికులకు సూచించాడు.

ఈ ఫొటో వ్యవహారం వైరల్ గా మారడంతో కేరళ బాధితులంతా మండిపడుతున్నారు. ఈ సెల్ఫీల పిచ్చి వల్ల అసలైన బాధితులకు నష్టం జరుగుతుందని.. సైనికులకు సమయం వృథా అయ్యి అసలు బాధితుల ప్రాణాలు పోతాయని మండిపడుతున్నారు. సైనికులతో గేమ్ ఆడి సెల్ఫీ తీసుకున్న యువకుడిని ఇడుక్కి డ్యాంలో వేయాలని మండిపడుతున్నారు నెటిజన్లు..
Tags:    

Similar News