కేర‌ళ‌లో సంచ‌ల‌నం రేపుతున్న బంగారం కుంభ‌కోణం!

Update: 2020-07-19 08:00 GMT
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేరళ బంగారం కుంభ‌కోణం కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసు ద‌ర్యాప్తు ముమ్మ‌రంగా కొన‌సాగుస్తోంది. ఈ కుంభ‌కోణానికి తెలంగాణ‌లోని హైదరాబాద్‌ తో లింకులు ఉన్నట్లు కస్టమ్స్‌ విభాగం గుర్తించింది. ఈ కేసులో అత్యంత కీలకమైన నగదు చెల్లింపులు హైదరాబాద్‌ నుంచే జరిగాయని అధికారులు భావిస్తున్నారు. రూ.కోట్లాది విలువ చేసే బంగారం కొనేందుకు నిందితులు అడ్డదారుల్లో హవాలా మార్గాల్లో చెల్లిస్తున్నార‌ని ద‌ర్యాప్తులో తేలింది. ఈ కేసులో రూ.కోట్లు హైదరాబాద్‌ నుంచి హవాలా రూపంలో దుబాయ్‌ కి చెల్లింపులు చేశారన్న సమాచారంపై కస్టమ్స్‌ శాఖ వివ‌రాలు సేక‌రిస్తోంది. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ ఐఏ) ద‌ర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులు స్వప్నా సురేశ్‌ - సందీప్‌ నాయర్‌ ను అరెస్ట్‌ చేసిన విష‌యం తెలిసిందే. గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారం కేరళలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ కుంభ‌కోణంలో ‌ఏకంగా ముఖ్య‌మంత్రి కార్యాలయం ప్రమేయం ఉందని తీవ్ర‌ ఆరోపణలు వ‌స్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి - రాష్ట్ర ఐటీ సెక్రటరీ శివశంకర్‌ ను తొలగించడం సంచ‌ల‌నం రేపుతోంది. ఈ కుంభ‌కోణంలో ఐటీ శాఖ ఉద్యోగి పాత్రపై ఆరోపణలు బయటపడడంతో ఆ శాఖ కార్య‌ద‌ర్శి శివశంక‌ర్‌ పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. ఈ నెల 6వ తేదీన దుబాయ్‌ నుంచి చార్టర్డ్‌ విమానంలో వచ్చిన కన్‌ సైన్‌ మెంట్‌ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

దౌత్య మార్గంలో తరలిన రూ.15 కోట్ల విలువైన బంగారం విమానాశ్రయంలో పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్‌ లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. అతడిని విచారించగా ఐటీ విభాగంలో పనిచేసే స్వప్న సురేశ్‌ హస్తం ఉన్నట్టు తెలిపారు. రాష్ట్ర ఐటీ - ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పరిధిలోని స్పేస్‌ పార్క్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ గా ఉన్న స్వప్న బంగారం తరలింపులో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ కుంభ‌కోణం ద‌ర్యాప్తు పూర్త‌యి అస‌లు నిందితులు వెలుగులోకి రానుంది.

Tags:    

Similar News