ఫేస్‌ బుక్ పోస్ట్‌ తో అడ్డంగా బుక్క‌యిన ఎంపీ భార్య‌

Update: 2019-10-22 17:10 GMT
సోష‌ల్ మీడియా చురుకైన పాత్ర పోషిస్తున్న నేప‌థ్యంలో...గ‌తంలో వ‌లే కాకుండా...ప్ర‌ముఖులు కాస్త జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ ఓ ప్ర‌ముఖురాలు అదే సోష‌ల్ మీడియా కేంద్రంగా చేసిన అతితో అడ్డంగా బుక్క‌యింది. త‌న‌తో పాటు త‌న పార్ల‌మెంటు స‌భ్యుడు అయిన త‌న భ‌ర్త‌ను సైతం ఆమె వివాదంలో చిక్కుకునేలా చేసింది. ఆమె...కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ భార్య ఆనా లిండా ఈడెన్.

ఇటీవల కేరళలో కురిసిన వర్షాలను త‌న క‌విత్వాన్ని జోడించి ఆమె పెట్టిన ఫోస్ట్ వివాదాస్ప‌దం అయింది. వ‌ర్షాల‌తో  కొచ్చీ న‌గ‌రంలోని ఇత‌ర ప్ర‌జ‌ల వ‌లే.... ఆమె ఇంటి పరిసరాలు సైతం నీట‌మునిగాయి. అయితే, దీనిపై లిండా ఒకింత అతిగా ఫేస్‌ బుక్‌ లో పోస్ట్ పెట్టారు. ఓ ఫోటో పెట్టి దానికింద‌..."విధి అత్యాచారం లాంటిది. ప్రతిఘటించటం కుదరకపోతే ఎంజాయ్ చేయాలి" అని త‌న క‌విత్వం జోడించారు.! దీంతో ఎంపీగారి భార్య పోస్ట్‌ ను చూసి ప‌లువురు షాక్ తిన్నారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చిత్రం ఏంటంటే...లిండా స్వయంగా జర్నలిస్టు. ఎంపీ భార్య‌. అలాంటి స్థానంలో ఉన్న ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై భ‌గ్గుమ‌న్నారు.

వ‌ర‌ద బాధితుల‌ను హేల‌న చేసే విధంగా ఉండ‌ట‌మే కాకుండా...చుల‌క‌న‌తో కూడిన ఈ పోస్ట్ వివాదంగా మారిన నేప‌థ్యంలో ఆనా లిండా క్షమాపణలు కోరారు. తనకు మహిళలను కించపరిచే ఉద్దేశం ఏమాత్రం లేదని ఈ కామెంట్ చేసినందుకు తానెంతో బాధపడుతున్నానని - ఫేస్‌ బుక్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.


Tags:    

Similar News