కేరళ... కేరాఫ్ ఏపీ పాలిటిక్స్

Update: 2018-08-02 04:28 GMT
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కేరళకు చెందిన నేతలు నిర్దేశించనున్నారా...? ఇక్కడ రాజకీయాలను వారు మలుపు తిప్పనున్నారా? కూటమి రాజకీయాలు - అయిదేళ్లకోసారి అధికార మార్పిడికి పేరుపడిన కేరళకు చెందిన నేతలైతేనే ప్రస్తుతం నాలుగురోడ్ల కూడలిలో ఉన్న ఏపీ రాజకీయాలను అర్థం చేసుకుని తమతమ పార్టీలకు బెనిఫిట్ చేయగలరా అంటే అవుననే అంటున్నాయి జాతీయ పార్టీలు. జాతీయ పార్టీలు ఈ విషయాన్ని నేరుగా చెప్పకపోయినా ఏపీ వ్యవహారాల ఇంచార్జిలుగా కేరళకు చెందిన నేతలను పంపించడంతో ఇలాంటి భావనే ఏర్పడుతోంది.
  
 ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇన్‌ చార్జిగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పనిచేస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఆయన్ను నియమించినప్పుడు ఈయనేం చేస్తాడు అని అంతా అనకున్నారు. కానీ... కానీ, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఆయన తీసుకున్నతరువాత చాలా మార్పులొచ్చాయి. మాజీ సీఎం కిరణ్ కాంగ్రెస్‌ లో చేరారు. చెల్లా చెదురైన పార్టీ శ్రేణులన్నిటినీ ఏకం చేసే పని జరగుతోంది. అన్నిటికీ మించి వయోభారాన్ని అధిగమిస్తూ చాందీ ఏపీలోనే ఎక్కువ సమయం గడుపుతూ నిత్యం నేతలతో ఇంటరాక్ట్ అవుతున్నారు.
  
కాంగ్రెస్ పార్టీ కేరళ మాజీ సీఎంను ఏపీ ఇన్ చార్జిగా తీసుకొస్తే.. భారతీయ జనతా పార్టీ కూడా కేరళ నేతను తమ ఇన్ చార్జిగా తీసుకొచ్చింది. ఈయన ఇంకా పని ప్రారంభించనప్పటికీ... స్పష్టమైన ఆదేశాలు - వ్యూహాలు - కార్యాచరణతోనే ఆయన ఇక్కడికొస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దగా లెక్కలోని రెండు జాతీయ పార్టీలు ఇలా కేరళ నేతలను నియమించుకోవడం ఎంతవరకు ఫలితమిస్తుందో చూడాలి.
Tags:    

Similar News