అమల్లోకి రానున్న సరి-బేసి విధానం ...ఎలా అమలు చేయబోతున్నారంటే ?

Update: 2020-04-18 05:30 GMT
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేసథ్యంలో , దాన్ని విస్తరించకుండా అడ్డుకోవడానికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించాయి. అయితే , మొదటి దశ లాక్ డౌన్ గడువు ముగిసే సమయానికి కరోనా కట్టడిలోకి రాకపోవడంతో ...మరోసారి మే 3 వరకు లాక్ డౌన్ ను పొడగిస్తునట్టు మోడీ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కరోనా ఎక్కువగా ఉన్నప్పటికీ  ఒక్క కేసు కూడా నమోదు కానీ చాల ప్రాంతాలలో కూడా ఉన్నాయి. దీనితో  ఈ ప్రాంతాలలో లాక్ డౌన్ ఎత్తివేసే దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలను సిద్ధం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేరళ రాష్టంలో కూడా ఏప్రిల్ 20 తరువాత కొన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంతాలలో కూడా కొన్ని షరతులు అమలులో ఉంటాయి అని తెలుస్తుంది. కేరళలోని కొన్ని జిల్లాల్లో, ఏప్రిల్ 20 తర్వాత ఈ విధానాన్ని అమలు చేస్తామని కేరళ ముఖ్యమంత్రి ప్రకటించారు. సరి , బేసి వ్యవస్థ అమలుకు ముందు కొన్ని షరతులు కూడా విధించనున్నారు. ఈ విధానంలో మహిళలకు మినహాయింపు ఉండే అవకాశం ఉంది. కరోనా వైరస్ కేసులు లేని జిల్లాల్లో మాత్రమే బేసి - సరి విధానం అమలు చేయబడుతుంది. ఈ విధానం ప్రకారం బేసి సంఖ్య నెంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలు బేసి రోజులలో మరియు సరి సంఖ్య నెంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలు సరి రోజులలో రోడ్డు మీదకి రావచ్చు.

అయితే  ఈ సరి , బేసి విధానాన్ని ఏ జిల్లాల్లో అమలు చేయాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. దీని కోసం రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే, కరోనా కేయూస్లు నమోదైన జిల్లాల్లో మే 3 వరకు లాక్ డౌన్ పాటించాల్సిందే. ఇలాంటి వ్యవస్థను కొద్ది రోజుల క్రితం తమిళనాడులో ప్రకటించారు. సరి , బేసి  లాంటి విధానానికి సమానమైన కలర్ కోడింగ్ పథకాన్ని తమిళనాడులో అమలు చేశారు. ఈ కలర్ కోడింగ్ విధానంలో ప్రతి వాహనానికి కూడా కలర్ వేస్తారు. వారి వాహనం కలర్ ను బట్టి .. ఆ వాహనానికి కేటాయించిన  రోజున మాత్రమే బయటకు రావడానికి అవకాశం ఉంటుంది.  ఈ నిబంధన పాటించకుండా వాహనాలపై రోడ్డు మీదకి వస్తే  జప్తు చేయబడతాయి. అలాగే వారి పై కఠిన చర్యలు తీసుకుంటారు.
Tags:    

Similar News