పగోడైనా జగన్ పాలనకు జై కొట్టాడు..

Update: 2019-10-31 06:58 GMT
టీడీపీ వర్సెస్ వైసీపీ.. పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంతలా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం నడుస్తుంది. ఒకరినొకరు తిట్టుకోవడాలు.. కొట్టుకోవడాలు.. మాటల తూటాలు పేల్చుకోవడాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. తెలంగాణలో ప్రతిపక్షం అంత గట్టిగా లేకున్నా ఏపీలో మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య వార్ సెగలు పుట్టించేలా ఉంటుంది. వైసీపీ వాళ్లను పగోళ్లుగా చూస్తారు టీడీపీ నేతలు. ఇక వైసీపీ వాళ్లు అంతే..

అయితే తాజాగా పగోడు కూడా జైకొట్టేలా జగన్ పాలించాడు. దాన్ని పగోడు తనివితీరా ప్రశంసించాడు. జగన్ పాలనకు జై కొట్టాడు. ఈ ఉదంతం తాజాగా చోటుచేసుకుంది.

విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రభుత్వ విధానాలను ప్రశంసించడం హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగుల ఆస్పత్రిలో కేశినేని నాని తన ఎంపీ నిధులతో నిర్మించిన భవనాన్ని తాజాగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలోనే మీడియాతో మాట్లాడిన విజయవాడ ఎంపీ కేశినేని నాని జగన్ పాలనపై ప్రశంసలు కురిపించడం వైసీపీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరిచింది.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం గ్రేట్ అంటూ కేశినేని అభినందించారు. తాను నిజంగానే ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. తాను ఉన్నది ఉన్నట్టుగా చెబుతానని.. ఇది ఖచ్చితంగా మంచి పరిణామమని అన్నారు.
Tags:    

Similar News