తొంబై ఏళ్లకు పైగా కొనసాతున్న ప్రైవేటు బస్సుల నిర్వహణ వ్యాపారాన్ని అర్ధాంతరంగా మూసేసిన టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎట్టకేలకు ఈ పరిణామంపై పెదవి విప్పారు. తాజాగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తాను దొంగతనంగా వ్యాపారాన్ని నిర్వహించలేదని అన్నారు. తప్పు చేయడం తన డీఎన్ ఏలోనే లేదని కేశినేని నాని తెలిపారు. నిజాయితీగా వ్యాపారం చేస్తుంటే నాపై దొంగగా ముద్ర వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ వ్యాపారం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు కేశినేని నాని ప్రకటించారు.
ట్రావెల్స్ వ్యాపారంలో గత రెండేళ్లుగా నష్టాలు వస్తున్నాయని కేశినేని నాని వాపోయారు. అయితే నష్టాలు వచ్చాయని ట్రావెల్స్ ను మూసివేయలేదని తెలిపారు. కొన్ని పరిణామాల రీత్యా తెలుగుదేశం పార్టీకి, సీఎం చంద్రబాబుకు చెడ్డపేరు రాకూడదనే బస్సులు నిలిపివేశానని నాని వివరించారు. ఈ వ్యవస్థను బాగుచేసే సత్తాలేకే ట్రావెల్స్ నుంచి తప్పుకున్నట్లు నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సురక్షితమైన ప్రయాణానికి కేశినేని ట్రావెల్స్ పెద్దపీట వేస్తుందన్నారు. ఆర్టీసీకి అద్దె బస్సుల కోటాలో తన బస్సు అసలే తిప్పనని తేల్చిచెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు లేకపోతే 20 రాష్ట్రాలున్నాయని చెప్పిన నాని అక్కడ నాకు రెడ్ కార్పెట్ పరుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/