విజయవాడ ఎంపీ కేశినేని నానీకి కొంతకాలంగా పార్టీలో నేతలతోనే పొసగడం లేదు. ఆయన రెండు నెలలుగా బీజేపీలోకి వెళతారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల సంగతి ఇలా ఉంటే పార్టీ అధినేత చంద్రబాబు - యువనేత లోకేష్ పై నాని ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే అసంతృప్తితో ఉన్నారు. అప్పుడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావుకు ఎక్కువ ప్రయార్టీ ఇవ్వడాన్ని నాని ముందు నుంచి జీర్ణించుకోలేకపోయారు.
ఇక తాజా ఎన్నికల్లో ఉమా ఓడిపోయారు. నాని మాత్రం వరుసగా రెండోసారి విజయవాడ ఎంపీగా గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన తనకంటే ఓడిన ఉమాకే మళ్లీ ఎక్కువ ప్రయార్టీ ఇవ్వడాన్ని నాని సహించలేకపోయారు. దీంతో నాని ట్విట్టర్ వేదికగా చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని ముందు తన అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ వార్ బుద్ధా వెంకన్న వర్సెస్ నాని వార్ గా మారిపోయి... బాగా ముదిరిపోయింది. చివరకు ఇద్దరు నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకునే వరకు వెళ్లింది.
పార్టీ ఆదేశాల మేరకు వెంకన్న కాస్త సైలెంట్ అయినా నాని మాత్రం తన ట్వీట్ల దాడిని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. చివరకు ఈ వార్ లోకి వైసీపీ నేత పీవీపీ దూరిపోయి నానిపై సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం నానికి పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు అర్బన్ టీడీపీ కార్యాలయం నానికి చెందిన కేశినేని భవన్ లో ఉండేది. సోమవారం నుంచి ఈ కార్యాలయం మారుస్తున్నట్టు ప్రకటన వెలువడింది.
విజయవాడలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అర్బన్ కార్యాలయాన్నికేశినేని భవన్ నుంచి ఆటోనగర్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలోకి తరలిస్తూ టీడీపీ ప్రకటన చేసింది. ఈ కార్యాలయం మార్పు వెనక నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బుద్ధా వెంకన్న హస్తం ఉందనేది నాని అనుమానంగా తెలుస్తోంది. వెంకన్న బాబుపై ఒత్తిడి తెచ్చే ఈ కార్యాలయాన్ని తన కేశినేని భవన్ నుంచి మార్పించారని భావిస్తోన్న నాని మరోసారి ట్వీట్టర్ వేదికగా వెంకన్నపై పరోక్షంగా సెటైర్ వేశారు. టీడీపీ పార్టీ ప్రకటనను కూడా జత చేస్తూ ‘తక్కువ లగేజీ ఉంటే సుఖంగా ఉంటుంది’ అని వ్యగ్యంగా ట్వీట్ చేశారు.