సన్మానం చేస్తారనుకుంటే ఇలా చేస్తారా? జగన్ కు నాని పంచ్

Update: 2020-02-09 09:25 GMT
సమయం.. సందర్భంగా చూసుకొని సూటిగా ట్వీట్ పంచ్ ల్ని సంధించటంలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని టాలెంట్ కాస్త భిన్నమని చెప్పాలి. టీడీపీకి చెందిన నేతలు పలువురు ఉన్నా..వారి సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణతో పోలిస్తే.. కేశినేని నాని అకౌంట్ చాలా చురుగ్గా ఉంటుందని చెప్పాలి.

తాజాగా ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ మీద సస్పెన్షన్ వేటు వేసిన వైనం సంచలనంగా మారింది. ఆయనపై విధించిన విచారణ పూర్తి కాకుండా విజయవాడకు దాటి వెళ్లకూడదన్న ఆదేశాల్ని జారీ చేశారు. ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది. నిజానికి ఆయన కారణంగానే గత ఎన్నికల్లో టీడీదపీ ఓడినట్లుగా పలువురు టీడీపీ నేతలు వాదిస్తారు.

ఆయన అసమర్థత.. గ్రౌండ్ లెవెల్లో ప్రజల నాడిని కనిపెట్టటంలో ఫెయిల్ కావటం కారణంగా చెబుతారు. ఇదిలా ఉంటే.. తాజాగా జగన్ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు విధించటంపై సెటైర్లు వేశారు కేశినేని నాని. మీరు ముఖ్యమంత్రి కావటానికి.. మీ పార్టీ అధికారంలోకి రావటంలో కీలకభూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ట్వీట్ పంచ్ ను సంధించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్ని టీడీపీలోకి తీసుకురావటంలోనూ ఆయన కీలకపాత్ర పోషించినట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తారు. మరి.. కేశినేని వారు వ్యాఖ్యానించినట్లుగా సన్మానించాల్సిన వ్యక్తికి సీఎం జగన్ షాకిచ్చారెందుకు?
Tags:    

Similar News