వ్యాపారవేత్తులుగా.. రాజకీయ నేతలుగా సుపరిచితులైన ఇద్దరు నేతల మధ్య డైలీ బేసిస్ లో సాగుతున్న ట్విట్టర్ వార్.. తాజాగా మరో ఆసక్తిరూపం దాల్చింది. ట్వీట్ తో టార్గెట్ చేయాలని ఫిక్స్ అయితే.. ఎలా అయినా చేయొచ్చన్న విషయాన్ని పీవీపీ తన తాజా ట్వీట్ తో తేలిస్తే.. అనవసరంగా ట్వీట్ చేసి కెలుక్కున్నాననే అనుకునేలా కేశినేనికి కొత్త అనుభవం ఎదురైంది.
ఇటీవల కాలంలో కేశినేని నాని.. పీవీపీలు ఒకరిపై ఒకరు పంచ్ లు మీద పంచ్ లు వేసుకోవటం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఈ ఇద్దరునేతల మధ్య నడుస్తున్న కౌంటర్.. ఎన్ కౌంటర్ ఆసక్తికరంగా మారింది. కేశినేని ట్రావెల్స్ కు చెందిన మాజీ ఉద్యోగులు తమకు రావాల్సిన జీతాల్ని వెంటనే చెల్లించాలని.. తమ బకాయిల్ని ఇవ్వాల్సిందిగా నానికి వ్యతిరేకంగా కొందరు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
దీనిపై స్పందించిన కేశినేని నాని.. ఎంతో ఘన చరిత్ర ఉన్నకమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారి పోవటం వల్లే ఈ రోజు దేశంలో ఆ పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించినట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంలో తనకేమాత్రం సంబంధం లేకున్నా పీవీపీ రియాక్ట్ అయ్యారు. కేశినేని నానికి దిమ్మ తిరిగేలా పంచ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ.
ఒకప్పుడు జవహర్ లాల్ నెహ్రూ లాంటి యోధాను యోధులతో పోరాడిన కమ్యునిస్టు సోదరులు.. ఎంతో ఘనమైన దోపిడీ చరిత్ర కలిగిన కోన్ కిస్కాగాడితో యుద్ధం చేయాల్సి వస్తోందంటూ కామెంట్ చేశారు. దీనికి తానెంతో బాధ పడుతున్నట్లుగా పేర్కొని తన రాజకీయ ప్రత్యర్థికి మరింత మంట పుట్టేలా చేశారు. ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధం రానున్న రోజుల్లో ఎక్కడి వరకూ వెళుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.