ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.

Update: 2021-05-04 12:30 GMT
కరోనా కల్లోలం వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తి స్థాయి కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణాతోపాటు ప్రైవేటు వాహనాలు తిరగడానికి వీల్లేదని ఏపీ కేబినెట్ తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అంతర్రాష్ట్ర , దూర ప్రాంత బస్సులు కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్టు తెలిపారు.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు , ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, ప్రజా రవాణాకు అనుమతి ఉండనుంది.బీసీల రిజర్వేషన్లు మరో పదేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 13న రైతు భరోసా తొలి విడతను రైతుల ఖాతాల్లో 4040 కోట్లు జమ చేయనున్నారు. మే 25న 38 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2805 కోట్లు జమ చేయనున్నారు.

ఏపీలో ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత దృష్ట్యా 45 ఏళ్లు పైబడిన వారికే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇక వ్యాక్సినేషన్లపై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రధానికి వ్యాక్సిన్ డోసులను త్వరగా కేటాయించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.

ఆక్సిజన్ కొరతను నివారించేందుకు తమిళనాడు, కర్ణాటక, ఒడిషాల నుంచి ఆక్సిజన్ రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.ఇక ఏపీలో రేపటి నుంచి పగలు, రాత్రి నైట్ టైం కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Tags:    

Similar News