క్యాబినెట్ నిర్ణయాలు; ఉద్యోగులు వచ్చేయాల్సిందే

Update: 2015-11-02 19:49 GMT
హైదరాబాద్ ను వదిలి రావాలంటే ససేమిరా అంటున్న ఏపీ సచివాలయ సిబ్బందిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపీ సర్కారు కింద పని చేస్తున్న ఉద్యోగులంతా వచ్చే ఏడాది జూన్ 2 నాటికి విజయవాడకు రావాల్సిందేనని తేల్చేశారు. ఈ వ్యవహారంలో ఏ ఒక్కరికి ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. సోమవారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ఎప్పటి మాదిరి గంటల కొద్దీ జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చ సాగింది.

ఏపీ సచివాలయ ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉండాలన్న అభిప్రాయం మంత్రివర్గ సమావేశంలో వ్యక్తమైందని.. ఇక ఎంతమాత్రం ఉపేక్షించకూడదన్న భావన వ్యక్తమైనట్లు చెబుతున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగులు బెజవాడ వచ్చే విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శించి.. వచ్చే ఏడాది జూన్ 2 నాటికి పూర్తి స్థాయి సెక్రటేరియన్ ను తరలించాలని నిర్ణయించారు.

ఇక.. అమరావతిలో మంత్రుల కార్యాలయాలు.. నివాసాలు తరలించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. మంత్రి వర్గ సమావేశంలో మరికొన్ని అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. అవేమంటే..

= మద్యం పాలసీపై చర్చ

= ప్రస్తుతం డ్వాక్రా మహిళల చేతుల్లో ఉన్న ఇసుక రీచ్ లను వారిస్థానే ప్రైవేటు వ్యక్తులకు అప్పగింత

= ఇసుక అక్రమాలపై వాడీవేడి చర్చతో పాటు.. అక్రమాల నియంత్రణకు ప్రత్యేకంగా ఐఏఎస్.. ఐపీఎస్ ల ఏర్పాటు

= నవంబరు 7 లోపు కాపుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్

= మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలన్న నిర్ణయానికి మార్పులు

= మద్యం దుకాణాలను లాటరీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం

= పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి

= నీరు – చెట్టు కార్యక్రమం సాగుతున్న తీరుపై చర్చ

= కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం

= ఉద్యోగులకు గృహ రుణాలు ఇవ్వటం

= జనవరి నుంచి హెల్మెట్ల వాడకం తప్పనిసరి

= ధ్రువీకరణ పత్రాల తగ్గింపునకు నిర్ణయం

= కుల.. ఆదాయ..నివాస ధ్రువీకరణ పత్రాలకు బదులుగా ఆధార్.. రేషన్ కార్డుల వినయోగం
Tags:    

Similar News