ఏపీలో నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొత్త జాబ్ క్యాలండర్ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ జీవితాలలో వెలుగు రావాలని కూడా వారు కోరుకుంటున్నారు. ఈ మధ్యనే ఏపీవ్యాప్తంగా నిరుద్యోగులు వైసీపీ సర్కార్ కి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసన తెలియచేశారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది కొత్త ఉద్యోగాలు ఇవ్వాలని దాదాపుగా జగన్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఏమిటీ అంటే అదంతా కసరత్తు పూర్తి అయిన తరువాత తెలుస్తుంది.
కానీ ఏపీలో గత మూడేళ్ళలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత పెరిగింది. ఇక జగన్ ఏటా జాబ్ క్యాలండర్ ప్రకటించి లక్షలలో ఉద్యోగాలు తీస్తామని చెప్పుకొచ్చారు. ప్రత్యేకించి పోలీసు, టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా పాదయాత్ర వేళ హామీ ఇచ్చారు. అయితే మూడేళ్లకు పాలన దగ్గర పడుతున్నా అవి మాత్రం నెరవేరలేదు. ఈ హామీని టచ్ చేయడానికే జగన్ ఆలోచిస్తున్నారు అని కూడా అంటున్నారు.
దానికి కారణం చితికిన ఆర్ధిక వ్యవస్థ. ఉద్యోగస్తులకే జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఉంది. దాంతో కొత్తగా జాబ్స్ అంటేనే ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే నిరుద్యోగులతో పెట్టుకుంటే రాజకీయంగా బాగా ఇబ్బందే అన్న సంగతి ప్రభుత్వానికి కూడా తెలుసు. దాంతో ఈ ఏడాది కొత్తగా జాబ్స్ ఇవ్వాలని ఆలోచిస్తోందిట.
ఇప్పటికే సచివాలయాలు ఏర్పాటు చేసి అక్కడ లక్షన్నర దాకా నియమించిన సిబ్బందిని చూపించి జాబ్స్ ఇచ్చేశామంటే ఎవరూ పట్టించుకోవడంలేదు. దాంతో వారికి ఈ ఏడాది జూన్ లో ప్రోబేషన్ డిక్లేర్ చేసి అధికారికంగా ఉద్యోగాలు ఇన్ని ఇచ్చామని చెప్పుకోవాలని వైసీపీ పెద్దలు చూస్తున్నారు అని అంటున్నారు.
దాంతో పాటుగా కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలను తీసుకోవడం ద్వారా నిరుద్యోగులలో పేరుకుపోతున్న ఆవేదనను ఆగ్రహాన్ని ఎంతో కొంత తగ్గించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది అని చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వివిధ విభాగాల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలుసుకుంటోంది.
దాంతో వాటిలో అత్యవసరం అయిన వాటిని ఈ ఏడాది రెండవ భాగంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు జారీ చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి కొత్త ఉద్యోగాలతో యువతను ఆకట్టుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఆచరణలో ఎంతవరకూ ఫలిస్తుందో చూడాల్సిందే.