ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. కొత్త జిల్లాలకు ఓకే

Update: 2020-07-15 12:30 GMT
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు మొగ్గు చూపింది. వైఎస్ జగన్ గత ఎన్నికల వేళ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకొని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది.

కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం.. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. రాష్ట్రం మొత్తం పర్యటించి జిల్లాల పునర్విభజన సమస్యలు, పరిష్కారాలను ఈ కమిటీ సూచిస్తూ నివేదికను అందజేయాలి. వచ్చే ఏడాది మార్చి 31వ తేది నాటికి రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది.

ఇక 2000 కోట్ల రుపాయల రుణాన్ని సమీకరించుకోవడానికి ఏపీఐఐసీకి ఏపీ కేబినెట్ అనుమతిచ్చింది. తద్వారా ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.

ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మహిళలకు ఆర్థిక సాయం అందించే ‘వైఎస్ఆర్ చేయూత’ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఏడాదిలో నాలుగు విడతల్లో అర్హులైన మహిళలకు రూ.75000 ఆర్థికసాయం అందిస్తారు.

+కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు
*ఇక నాడు-నేడు కింద ప్రాథమిక విద్యా మంత్రిత్వశాఖకు 28పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
*ఒంగోలు, శ్రీకాకుళంలో ఐఐఐటీలైన ఆర్జీయూకేటీ లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది.
*నెల్లూరు జిల్లాలో దగదర్తి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు కేబినెట్ అనుమతిచ్చింది.
*రాయలసీమ కరువును తీర్చడానికి ఓ కార్పోరేషన్ ఏర్పాటు చేసింది.
*కర్నూలు జిల్లా ప్యాపిలీలో 5కోట్లతో గొర్రెల కాపారుల శిక్షణా కేంద్రం
*గుంటూరులో ఉపాధ్యాయులపై నమోదైన కేసుల ఎత్తివేత..
Tags:    

Similar News