ఏపీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ హత్యకేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి పులివెందుల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఇప్పటికే అతడిని కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. అయితే శివశంకర్ రెడ్డికి డిసెంబర్ 2 వరకూ కోర్టు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.
మరోవైపు శివశంకర్ రెడ్డిని కలిసేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టుకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఉన్నారు.
వైఎస్ వివేకా డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కుమారుడు చైతన్యరెడ్డి సీబీఐకి లేఖ రాశారు. వివేకా హత్యతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని.. కేసులో తమకు న్యాయం చేయాలని కోరారు.
వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి సంచలన నిజాలు పంచుకున్నారు. వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తానన్నారని.. అందులో రూ.5 కోట్లు తనకు ఇస్తామని చెప్పినట్లు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చాడు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి ఏం జరుగకుండా చూసుకుంటామన్నారని దస్తగిరి తెలిపాడు.