గూగుల్ నుంచి కీలక ఉద్యోగి అవుట్..! సారీ చెప్పిన సుందర్ పిచాయ్..! ఇంతకీ ఏం జరిగింది?
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కాలర్ టిమ్నిట్ గెబ్రూ.. గూగుల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా స్పందించారు. టిమ్నిట్ గెబ్రా గూగుల్ నుంచి తప్పుకోవడం బాధాకరమని.. అందుకు తాను పశ్చాత్తాప పడుతున్నానని సుందర్ పేర్కొన్నాడు. టిమ్నిట్ గెబ్రూ గూగుల్ ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కాలర్. గూగుల్ సంస్థ పురోగతికి ఆమె ఎంతోగానో తోడ్పడ్డారు. గూగూల్ పబ్లిక్ ఇమేజ్ను బెటర్ చేసేందుకు గెబ్రు ఎంతో శ్రమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలోని అనేక సమస్యలను ప్రశ్నించారు. ఆమె సడెన్గా సంస్థ నుంచి నిష్క్రమించారు.
టిమ్నిట్ గూగుల్ ను వీడటం ప్రపంచవ్యాప్తంగా సాప్ట్వేర్ రంగంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంపై సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. ఆయన అకస్మికంగా బయటకు వెళ్లడం బాధకరమన్నారు. ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పారు. గెబ్రూ నిష్క్రమణకు దారితీసిన పరిస్థితుల గురించి గూగుల్ సమీక్షిస్తుందన్నారు. నిజానికి గెబ్రూ ను గూగుల్ సంస్థ తొలగించింది. కానీ ఈ విషయాన్ని వాళ్లు రాజీనామాగా ప్రకటించారు. దీంతో తీవ్ర దుమారం రేగింది. దీంతో సుందర్ పిచాయ్ రంగంలోకి దిగాడు. ‘గెబ్రూ తొలగింత తన దృష్టికి వచ్చింది. ఈ తొలగింత ఎన్నో అనుమానాలకు తావిచ్చింది.
మరింత మంది ఉద్యోగులు ప్రశ్నించేందుకు తావిచ్చింది. దీని పట్ల నేను క్షమాపణ చెబుతున్నాను. మీ నమ్మకాన్ని పునరుద్ధరించే బాధ్యతను తీసుకుంటున్నాను' అని సుందర్ పిచాయ్ అన్నారు. అయితే గూగుల్లోన చాలామంది ఉద్యోగులు గెబ్రూకు అండగా నిలబడ్డారు.