రెండో దశ పోలింగ్.. పోటీలోని ప్రముఖులు వీళ్లే!

Update: 2019-04-17 04:14 GMT
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ లో కొందరు ప్రముఖులు పోటీలో ఉన్నారు. వారి జాతకాన్ని రేపు ఆయా నియోజకవర్గాల ప్రజలు రేపు డిసైడ్ చేస్తారు. ఫలితాలు అయితే ఇప్పుడే రావు. దేశమంతటి ఎన్నికల ఫలితాలతో పాటు మే  ఇరవై మూడున వీటి కథ వెల్లడి అవుతుంది. ఇంతకీ రేపు జరిగే రెండో దశ పోలింగ్ లో పోటీలో ఉన్న ప్రముఖులు ఎవరెవరంటే..

-కర్ణాటకలోని మండ్య స్థానం నుంచి సుమలత పోటీలో ఉన్నారు. అక్కడ జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కు - స్వతంత్ర అభ్యర్థి అయిన సుమలతకు గట్టి పోటీ నెలకొంది.

-తుమకూరు స్థానం నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ పోటీలో ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థితో ఆయన పోరాడుతున్నారు.

-మహారాష్ట్ర  మాజీ ముఖ్యమంత్రి - కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే పోటీలో ఉన్న  షోలాపూర్ నియోజకవర్గానికీ రేపే పోలింగ్ జరగనుంది.

-బెంగళూరు  నుంచి ప్రకాష్ రాజ్ పోటీలో ఉన్న సెంట్రల్ సీటుకు సంబంధించిన పోలింగ్ కూడా రేపు జరగనుంది.

-మహారాష్ట్రలోనే ప్రీతమ్ ముండే పోటీ చేస్తున్న బీడ్ నియోజకవర్గం కూడా ఆసక్తిని రేపుతోంది.

-తమిళనాడులో కూడా ప్రముఖులకు సంబంధించిన జాతకానికి రేపే ఓట్లు పడనున్నాయి.

-చెన్నై సెంట్రల్ నుంచి దయానిధి మారన్ - తూతుకుడి నుంచి కనిమొళి పోటీ పడుతున్నారు. కనిమొళికి పోటీగా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందర రాజన్ పోటీలో ఉన్నారు.

-నీలగిరి నుంచి మరోసారి పోటీకి దిగారు కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా

-హేమమాలిని పోటీలో ఉన్న మధుర నియోజకవర్గం పోలింగ్ కూడా రేపే జరగనుంది.

మరి ఈ ప్రముఖుల్లో ప్రజల మొగ్గు పొందేది ఎవరెవరో!
Tags:    

Similar News