చాన్నాళ్ల త‌ర్వాత వెలిగిపోయిన 'చంద్ర‌న్న‌'

Update: 2022-12-22 05:10 GMT
తాజాగా ఖమ్మంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. ఊహించ‌ని రీతిలో ఇక్క‌డ ప్ర‌జ‌లు హాజ‌రు కావ‌డంతో చాన్నాళ్ల త‌ర్వాత ఆయ‌న ముఖంలో ఎన‌లేని ఆనందం క‌నిపించింది. ఇటీవ‌ల ఆయ‌న ఏపీలో త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తున్నా.. ఎక్క‌డా కూడా ఆయ‌న‌కు మ‌న‌స్సాంతి లేకుండా పోయింది. ఏదో ఒక కీచులాట‌తో ఏపీలోర‌గడల‌తోనే పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది.

కానీ, దీనికి భిన్నంగా తాజాగా ఖ‌మ్మంలో నిర్వ‌హించిన టీడీపీ బ‌హిరంగ స‌భ‌.. భారీ ఎత్తున స‌క్సెస్ అయింది. చంద్ర‌బాబు స‌భ‌లో చాలా ఏళ్ల త‌ర్వాత‌.. ఉల్లాసంగా ఉత్సాహంగా ప్ర‌సంగించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇంత మందిని ఆక‌ట్టుకోవ‌డం..చంద్ర‌బాబుకు పెద్ద స‌వాలే అయింది. ఎందుకంటే.. మ‌ధ్య‌లో ఆయ‌న సుమారు 25 నిమిషాల పాటు త‌న‌సొంత స్వోత్క‌ర్ష‌ను వ‌ల్లెవేశారు. దీంతో స‌భ‌లో కొంత బోర్ ఫీలైన ప‌రిస్థితి కూడా వ‌చ్చింది.

హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి తాను పడ్డ‌ కష్టాన్ని చంద్రబాబు పూస గుచ్చిన‌ట్టు వివ‌రించారు.  ఐటీ ప్రాధాన్యతను 25 ఏళ్ల క్రితమే గుర్తించానంటూ.. పాత కొథే కొత్త గా చెప్పుకొచ్చారు.

ఐటీ ప్రాధాన్యం గుర్తించి హైటెక్‌ సిటీని నిర్మించానని.. అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ క్యాంపస్లు పెట్టేందుకు ప్రపంచమంతా తిరిగానని తెలిపారు. ఐటీలో భారతీయులతో ఎవరూ పోటీ పడలేరని ఆనాడే చెప్పానన్నారు.

హైదరాబాద్‌కు ఐఎస్‌బీ కూడా తీసుకొచ్చేందుకు ఎన్నో పాట్లు పడ్డానని తెలిపారు. ఎంతో ముందుచూపుతో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేశానని.. ఇప్పుడు అందులోనే కరోనా టీకా తయారుకావడం సంతోషంగా ఉంద న్నారు.

తెలుగుదేశం పార్టీ రుణం తీర్చుకుంటామని యువత ముందుకు వచ్చారని తెలిపారు. మొత్తంగా చూస్తే.. బాబు స‌భ హిట్ట‌యినా.. స్వోత్క‌ర్ష ఎక్కువ‌గా ఉండడం స్థానిక స‌మ‌స్య‌ల ను ట‌చ్ చేయ‌క పోవ‌డం మైన‌స్ అయ్యాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News