లోకేష్ పండుగ చేసుకుంటున్నారు. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో తమ ప్రభుత్వం హయాంలో పురుడుపోసుకొని తొలి కారు విడుదల చేస్తూ ఫలితాన్ని ఇప్పుడు ఇచ్చిన కియా మోటార్స్ విజయాన్ని సంబరంగా జరుపుకుటున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియో మోటార్స్ కంపెనీ తన తొట్టతొలి కారును భారత మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. జగన్ ఢిల్లీలో ఉండడంతో ఈ వేడుకకు వైసీపీ మంత్రులు హాజరై మేడ్ ఇన్ ఆంధ్రాలో తయారైన కియా కారును ఆవిష్కరించనున్నట్టు సమాచారం.
అయితే చంద్రబాబు హయాంలో వచ్చినట్టు చెప్పుకుంటున్న కియా మోటార్స్ తొలి కారు విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో నారా లోకేష్ కొద్దిసేపటి క్రితమే ఓ పోస్టు పెట్టారు. ‘చంద్రబాబు దార్శనికతకు కియా మోటార్స్ ఫలితమిచ్చింది. ఏపీలో చంద్రబాబు కృషి నెలకొల్పిన ఈ ప్లాంట్ నుంచి తొలి కారు విడుదలవ్వడం మాటల్లో చెప్పలేనిది. ఈ సందర్భంగా కియా యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు’ అంటూ కియా ఘనతను చంద్రబాబు ఆపాదించి లోకేష్ ఓ పేపర్ కటింగ్ ను పోస్టు చేశారు.
జగన్ ఢిల్లీ పర్యటన, వరదలపై సమీక్ష నేపథ్యంలో తొలి కారు ఆవిష్కరణకు ఏపీ మంత్రి బుగ్గన హాజరవుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ తోపాటు టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఇది తమ ఘనతగా చెప్పుకుంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ విజయాన్ని తమదిగా చెప్పుకుంటూ తాజాగా హ్యాష్ ట్యాగ్ తో వైరల్ చేస్తున్నారు. ‘థాంక్యూ సీబీఎన్ ఫర్ కియా’ అనే పేరుతో ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ట్రెండ్ చేస్తున్న రెండో హ్యాష్ ట్యాగ్ ఇది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 40 ఏళ్ల చంద్రబాబు ఎవరికి రోల్ మోడల్ అని జగన్ అన్నప్పుడు ‘సిబీఎన్ మై రోల్ మోడల్’ అనే హ్యాష్ ట్యాగ్ ను టీడీపీ అభిమానులు ట్రెండ్ చేశారు. ఇప్పుడు కియా కారును తమ ఘనతగా చెప్పుకుంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.