కరవు ఖిల్లాగా చెప్పే అనంతపురం జిల్లాకు కొరియా కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఏపీలో మరే జిల్లాలో లేని రీతిలో అనంతపురం మీద కొరియా కంపెనీలు ఇంత ఆసక్తి ఎందుకు ప్రదర్శిస్తున్నాయి? అన్న సందేహం కలగక మానదు. దీనికి కారణం లేకపోలేదు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియ అనంతపురం జిల్లాలో ఫ్లాంటు ఏర్పాటు చేస్తోంది.
ఇందుకు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. ఏపీ రాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న సులభతర వాణిజ్య సరళి విధానాలతో పలు కంపెనీలు ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి.
ఇందులో భాగంగానే కియా కంపెనీ అనంతకు వచ్చింది. దీంతో.. ఈ కంపెనీకి అనుబంధంగా ఉండే మరికొన్ని కంపెనీలు అనంతబాట పట్టాయి. ఏపీలో నెలకొన్న వాణిజ్య విధానాల తీరును తెలుసుకున్న కొరియా కంపెనీలు ఏపీకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
కియ పుణ్యమా అని అనంతరూపురేఖలు మారనున్నట్లుగా చెబుతున్నారు. కియ అనుబంధ సంస్థలు దాదాపు 19 సంస్థలు అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో వేలాది కోట్ల రూపాయిల పెట్టుబడులు జిల్లాకు రానున్నాయి. ఇందుకు సంబంధించిన చర్చలు ఏపీ సర్కారుతో కొరియా కంపెనీలు ఇప్పటికే పూర్తి చేశాయి.
ఏపీ సర్కారుతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఈ నెల 9న దాదాపు 20 వరకు కొరియా కంపెనీలు అనంతకు వచ్చేందుకు వీలుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నాయి. ఈ కంపెనీలన్నీ తమ కార్యకలాపాలు కానీ స్టార్ట్ చేస్తే దాదాపు 12వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. కొరియా కంపెనీల ఎంట్రీతో అనంత జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయని చెప్పక తప్పదు.