మావోల చేతుల్లో ప్రాణాలు విడిచిన అరకు ఎమ్మెల్యే కిడారి వ్యవహారంలో బాబు మొండితనమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాను పట్టిన కుందుటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరించిన బాబు తీరే.. కిడారి ప్రాణాలు పోవటానికి కారణంగా చెబుతున్నారు. గ్రామదర్శిని కార్యక్రమాన్ని తాను చేపట్టలేనని.. ఈ కార్యక్రమాన్ని తన నియోజకవర్గం వరకూ మినహాయించాలని కోరినా బాబు నో అన్నట్లు చెబుతున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితో గ్రామదర్శిని ప్రోగ్రామ్ కు వెళ్లిన కిడారి చివరకు మావోల చేతుల్లో ప్రాణాలు విడిచినట్లుగా చెబుతున్నారు. తనకు మావోలతో థ్రెట్ ఉందని.. ఏవోబీలో మావోల ప్రభావం ఎక్కువగా ఉందని.. తన నియోజకవర్గంలోని గ్రామాలన్నీ మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి.. తనను ఆ కార్యక్రమం నుంచి మినహాయించాలని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే.. కిడారి వేడుకోలును బాబు పట్టించుకోలేదని తెలుస్తోంది.
గత నెలలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో బాబును కిడారి వేడుకున్నట్లుగా చెబుతున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని వివరించి గ్రామదర్శిని మినహాయింపు ఇవ్వాలని కోరినా.. ప్రయోజనం లేకపోయిందంటున్నారు.
కిడారి వేడుకోలుకు చంద్రబాబు ససేమిరా అనటమే కాదు.. తప్పనిసరిగా హాజరవ్వాల్సిందేనన్న ఆదేశాలతో ఎదురు చెప్పలేక ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యేలు.. పార్టీ ఇన్ ఛార్జిలు ప్రతి గ్రామానికి వెళ్లి గ్రామదర్శిని కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీంతో.. భయం భయంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కిడారి భయమే నిజమైంది. భయంతో మారుమూల ప్రాంతానికి వెళ్లిన ఆయన మావోల కర్కసత్వానికి ప్రాణాలు వదలాల్సి వచ్చినట్లుగా చెబుతున్నారు. బాబు ఏ మాత్రం ముందుచూపుతో వ్యవహరించి ఉంటే.. కిడారికి పొంచి ఉన్న ప్రాణహానిని తప్పించుకునే అవకాశం ఉండేదన్న మాట బలంగా వినిపిస్తోంది.