ఏపీ కేబినెట్ లో పిన్న వయస్కుడిగా ఉన్న వైద్య - ఆరోగ్య శాఖ మంత్రి కిడారి శ్రావణ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత కిడారి సర్వేశ్వరరావు... ఆ తర్వాత టీడీపీలో చేరిపోవడం, తదనంతర పరిణామాల్లో ఆయన మావోయిస్టుల చేతిలో హత్యకు గురికావడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎలాంటి చట్టసభ సభ్యత్వం లేకుండానే కిడారి శ్రావణ్ కు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి లభించింది. శ్రావణ్ కు మంత్రి పదవి ఇవ్వడంలో చూపిన ఆసక్తిని... ఆయనను ఆరు నెలల్లోగా చట్ట సభ సభ్యుడిగా ఎంపిక చేయించడంలో చంద్రబాబు ఆసక్తి చూపలేదనే చెప్పాలి.
ఈలోగా ఎన్నికలు రావడం, శ్రావణ్ విషయాన్ని మొత్తంగానే మరిచిపోవడం జరిగిపోయింది. ఈ క్రమంలో మంత్రిగా చేరి ఆరు నెలలు పూర్తి అవుతున్నా... ఇంకా చట్టసభల్లో సభ్యుడిగా లేని శ్రావణ్ తో రాజీనామా చేయించాల్సిందేనని గవర్నర్ కార్యాలయం నుంచి లేఖ వచ్చేదాకా అసలు ఈ విషయంపై ఏ ఒక్కరు కూడా దృష్టి సారించనే లేదు. ఇప్పుడు చేసేదేమీ లేని నేపథ్యంలో కిడారి శ్రావణ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. అయితే జరిగేదేంటో తెలిసిపోయినా... టీడీపీ దీనిపై తనదైన శైలిలో ప్రచారం చేసుకునేందుకే యత్నించింది. రాజీనామా చేయడానికి విశాఖ నుంచి అమరావతి వచ్చిన శ్రావణ్ తొలుత చంద్రబాబు అధికారిక నివాసానికి వెళ్లారు. అక్కడ చంద్రబాబు లేకపోవడంతో ఆయన కుమారుడు నారా లోకేశ్ తో శ్రావణ్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాజీనామా, తదనంతర పరిణామాలపై శ్రావణ్ తో లోకేశ్ చర్చించారట. ఇప్పుడు రాజీనామా చేయడం మినహా గత్యంతరం లేదన్న విషయాన్ని వారిద్దరూ అంగీకరిస్తూనే... పార్టీలో మంచి అవకాశాలు కల్పిస్తామని, ఫ్యూచర్ కేమీ ఇబ్బంది లేదని, ఈ విషయంపై తనదే హామీ అని శ్రావణ్‌కు లోకేశ్ భరోసా ఇచ్చారట. ఈ భరోసాతో గుండె నిబ్బరం చేసుకున్న శ్రావణ్ ఆ తర్వాత నేరుగా సచివాలయానికి వెళ్లి... సీఎం ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్రకు తన రాజీనామా లేఖను అందజేశారట. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు, సహకరించిన అధికారులకు శ్రావణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారట.