క్రైం థ్రిల్లర్ సినిమాల్ని చూసి స్పూర్తి పొంది నేరాలు చేసే కొందరిని చూస్తుంటాం. తాజాగా అలాంటిపనే చేశాడో ప్రబుద్ధుడు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘నెట్ ఫ్లిక్స్’ సూపర్ హిట్ అయిన ‘మనీ హెయిస్ట్’ వెబ్ సిరీస్ ను చూసి స్ఫూర్తి పొందిన హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడు దారి తప్పాడు. ఒక ముఠాను ఏర్పాటు చేసి.. కిడ్నాప్ లు చేస్తూ నేరాలకు పాల్పడ్డాడు. తాజాగా పోలీసులకు చిక్కాడు. ఇతగాడు చేసే నేరాలు మరో స్థాయిలో ఉండటం గమనార్హం.
అమ్మాయిలతో వలపు వల విసిరి.. అందులో చిక్కేలా చేసి.. ఆశ చూపించి విడిగా కలుద్దామని చెప్పటం.. తీరా వచ్చాక కిడ్నాప్ చేసి.. ఆయా కుటుంబాల వారికి ఫోన్లు చేసి డబ్బుల కోసం డిమాండ్ చేసే వైనం షాకింగ్ గా మారింది. తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇతగాడిని విచారించగా అతడు చేసిన నేరాలన్ని వెల్లడించాడు. ఇంతకూ అతనేం చేస్తాడంటే..
మెహిదీపట్నంలోని భోజగుట్టకు చెందిన సురేశ్ కు నేర చరిత్ర ఉంది. 2011 నుంచి అతను నేరాలు చేసేవాడు. హైదరాబాద్ మహానగరంలోని ట్రూ కమిషనరేట్లు (హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ) కలిపి మొత్తం 14 చోరీ కేసులు ఉన్నాయి. 2019 డిసెంబరులో జైలుకు వెళ్లి మూడు నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన చరిత్ర ఉంది. జైలు నుంచి బయటకు వచ్చిన 27 ఏళ్ల సురేశ్ కు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లోని ‘మనీ హెయిస్ట్’ వెబ్ సిరీస్ విపరీతంగా ఆకర్షించింది. అందులో ఒక ప్రొఫెసర్.. కొందరు కిరాయి మనుషుల్ని ఒక గ్యాంగ్ గా తయారు చేసిన నేరాలు చేయించిన తీరుతో స్ఫూర్తి పొందిన సురేశ్.. అదే తరహాలో డబ్బున్న యువకుల్ని టార్గెట్ చేసి కిడ్నాప్ చేయాలని డిసైడ్ అయ్యాడు.
ఇందులో భాగంగా ముగ్గురు యువకుల్ని (రోహిత్, నర్సింహులు, కునాల్).. ఒక యువతి(శ్వేతాచారి)ని నియమించుకున్నాడు. వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు జీతంగా ఇచ్చేవాడు. ఇప్పటివరకు ఆరు కిడ్నాపులు చేసి రూ.50 లక్షల వరకు వసూలు చేశాడు. తాము టార్గెట్ చేసిన యువకుడికి ఫోన్ చేయటం.. పరిచయం చేయటం.. వలపు వల విసరటం.. కొన్నాళ్లకు చనువు పెంచుకొని తాము అనుకున్న చోటుకు రప్పిస్తారు.
అప్పటికే అక్కడ కాపుకాసే నలుగురు యువకులు కిడ్నాప్ చేసి కారులో రహస్య ప్రాంతానికి తీసుకొస్తారు. వారి కుటుంబీకులకు ఫోన్లు చేసి.. కిడ్నాప్ చేశామని.. డబ్బులు చెల్లించి తీసుకెళ్లాలని చెబుతారు. దీంతో.. వారు చెప్పినంత డబ్బుల్ని చెల్లించి తీసుకెళతారు. తమకు జరిగింది బయటకుచెబితే పరువు పోతుందన్న ఉద్దేశంతో తేలు కుట్టిన దొంగలు మాదిరి ఉండిపోతారు.
తాజాగా గుడిమల్కాపూర్ మార్కెట్లో పూల వ్యాపారం చేసే ప్రశాంత్ అనే యువకుడు ఈ నెల 5 మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. అతని కోసం కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. రోజు తర్వాత కూడా ఇంటికి రాకపోవటంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. తర్వాతి రోజు మధ్యాహ్నం ప్రశాంత్ సోదరుడికి ఫోన్ వచ్చింది.
అతడ్ని కిడ్నాప్ చేశామని.. డబ్బులు ఇస్తే వదిలేస్తామని చెప్పటంతో.. కిడ్నాపర్లు చెప్పినట్లే ఔటర్ రింగు రోడ్డు వద్ద డబ్బులు ఇచ్చేసి ప్రశాంత్ ను తీసుకొచ్చారు. ఈ విషయాల్ని పోలీసులకు తెలిపారు. ఫోన్ చేస్తే లొకేషన్ గుర్తిస్తారన్న ఉద్దేశంతో వాట్సాప్ కాల్ మాత్రమే చేసే ఈ ముఠా.. డబ్బులు ఇస్తున్న బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వకపోవటంతో మరింతగా చెలరేగిపోయారు. పోలీసులకు చెబితే పరువు పోతుందన్న భయంతో ఉన్న వారి బలహీనతతో లక్షల్లో డబ్బు వసూలు చేయటం షురూ చేశారు. ఈ గ్యాంగ్ కు చెందిన అందరిని అదుపులోకి తీసుకున్నప్పటికీ వలపు వల విసిరే శ్వేతాచారి కోసం వెతుకుతున్నారు. ఆమె దొరికితే.. ఈ ముఠా మొత్తం జైలుకు వెళ్లినట్లు అవుతుంది.