కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలో ఇటీవలి కాలంలో ప్రొఫెసర్లు వివాదాస్పద శైలి రివాజుగా మారుతుందనే చర్చ వినిపిస్తోంది. కొద్దికాలం క్రితం ఓ ప్రొఫెసర్ విద్యార్థినుల వస్త్రాదారణ గురించి ఆర్డర్ వేయగా తాజాగా మరో ప్రొఫెసర్ అమ్మాయిలు ధరించే వస్తువుల కారణంగా కొత్త లాజిక్ ఒకటి తెరమీదకు తెచ్చారు. కేరళలోని కాలడిలోని ఓ ప్రభుత్వ కళాశాలలో అథ్యాపకుడైన రజత్ కుమార్ మహిళ జీన్స్ ధరిస్తే వారి పిల్లలు ట్రాన్స్‌జెండర్ అవుతారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తల్లులు పురుషుల్లాగా వ్యవహరించడమే పిల్లల్లో అటిజం రావడానికి కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రజత్ కుమార్ గతంలోనూ ఇలాంటి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆటిజం గురించి జరిగిన చర్చలో పాల్గొన రజత్ కుమార్ స్త్రీ - పురుషులు తమ సహజ శైలిని వదిలిపెట్టడంతో సమస్యలు వస్తున్నాయన్నారు. మహిళ తన స్త్రీత్వాన్ని - పురుషుడు తన పురుషత్వాన్ని దిగజార్చుతారో వారికి పుట్టే బాలిక మగవాడి లక్షణాలను అందిపుచ్చుకుంటుందని, అలాంటి మహిళకు జన్మించిన బిడ్డ ట్రాన్స్ జెండర్ అవుతారని ఈ ప్రొఫెసర్ గారు విశ్లేషించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పలు మహిళా సంఘలు మండిపడ్డాయి. మహిళా సంగాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. రజత్ వ్యాఖ్యలు రచ్చరచ్చగా మారిన నేపథ్యంలో...ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని కేరళ విద్యా మంత్రి కేకే శైలజ కోరారు.