ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ఉత్తర కొరియాలోనూ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నా.. అది పెద్ద మ్యాటరే కాదు అన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యవహరిస్తున్నారు. ప్రజలను పట్టించుకోకుండా.. క్షిపణి ప్రయోగాలతో అమెరికా వంటి దేశాలతో గిల్లిగజ్జాలు పెట్టుకుంటున్నారు. 35 నిమిషాల్లో 8 మిసైల్స్ను ప్రయోగించి ప్రపంచ దేశాల్లో కిమ్ టెన్షన్ పుట్టించారు. కానీ తమ దేశంలో కరోనా టెన్షన్ను మాత్రం పట్టించుకోవడం లేదు.
ఉత్తర కొరియాను కరోనా అల్లాడిస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు మాత్రం.. అది పెద్ద మ్యాటరే కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. జనాలను పట్టించుకోవడం లేదు కదా.. క్షిపణి ప్రయోగాలతో అమెరికాలాంటి దేశంతోనే గిల్లీ పంచాయితీ పెట్టుకుంటున్నారు. 35 నిమిషాల్లో 8 మిస్సైల్స్ ప్రయోగించి.. కిమ్ ఒక్కసారిగా టెన్షన్ పుట్టించారు.
ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఓవైపు పరీక్షలు చేయక.. మరోవైపు మందులు లేక ప్రజలు విలవిలలాడిపోతున్నారు. కానీ ఆ దేశ అధ్యక్షుడు మాత్రం అవేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దేశంలో కరోనాకు అడ్డుకట్ట వేయాల్సింది పోయి ఇతర దేశాల్లో వణుకు పుట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. 35 నిమిషాల్లో 8 మిసైల్స్ ప్రయోగించి ప్రపంచ దేశాల్లో కిమ్ టెన్షన్ పుట్టించారు.
తమ దేశంలో కరోనా సృష్టిస్తున్న అల్లకల్లోలాన్ని పట్టించుకోకుండా.. జనాలు పిట్టల్లా రాలిపోతున్నా చర్యలు తీసుకోకుండా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ తన బిజీలో తానున్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే.. వైరస్ను అరికట్టడం కంటే కిమ్కు బిజీ పనులేం ఉన్నాయనుకుంటున్నారా.. క్షిపణి పరీక్షలు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే.. ఏ మాత్రం తగ్గేదేలే అంటూ... అమెరికా ఎన్ని సార్లు హెచ్చరించినా.. లెక్క చేయకుండా ఉత్తర కొరియా మాత్రం వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూనే ఉంది. రాజధాని ప్యాంగాంగ్‌కు సమీపంలోని సునన్ అనే ప్రాంతంలో 35 నిమిషాల వ్యవధిలో 8 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఒక్కరోజులో ఉత్తర కొరియా ప్రభుత్వం అత్యధిక బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి.
ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదని.. త్వరలోనే మళ్లీ ఉత్తర కొరియా అణు పరీక్షలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించడానికి జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించనున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తెలిపారు. ఇటీవల అమెరికా నావికా దళాలు, దక్షిణ కొరియా సైన్యంతో కలిసి ఫిలిప్పీన్స్ సముద్రంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. ఇందులో అమెరికా విమాన వాహక నౌక రోనాల్డ్ రీగన్ సైతం పాల్గొంది. 2017 తర్వాత విన్యాసాల్లో ఓ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పాల్గొనడం ఇదే ఫస్ట్‌టైమ్. ఈ పరిస్థితుల్లోనే ఉత్తరకొరియా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది.
ఉత్తర కొరియా చేపట్టిన ఎనిమిది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను జపాన్ సముద్రం వైపు ప్రయోగించారు. వీటిని దక్షిణ కొరియా సైన్యం గుర్తించింది. జపాన్ కూడా ఈ ప్రయోగాలను ధ్రువీకరించింది. అమెరికా, దక్షిణ కొరియా ఉమ్మడి సైనిక విన్యాసాలను… ఉత్తరకొరియా మొదటినుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. వాటిని తమపై దాడుల కోసం చేపడుతోన్న రిహార్సల్స్ అంటున్న కిమ్ జోంగ్.. తాము ఏంటో చూపించాలని అనుకున్నారని.. అందుకే యూఎస్ హెచ్చరికలను కూడా బేఖాతరు చేశారన్న చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం చేపట్టిన ప్రయోగాలతో నార్త్ కొరియా 2022లో క్షిపణి పరీక్షల సంఖ్య ఏకంగా 18కి చేరుకుంది. ఈ పరీక్షల్లో ఖండాంతర బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఉత్తర కొరియా అణు పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల కారణంగా అమెరికా భూభాగానికి, తమ పౌరులకు ఎలాంటి ముప్పు లేదని అమెరికా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఓ వైపు కరోనాతో జనం పిట్టల్లా రాలిపోతుంటే.. అదేం పట్టనట్లు అమెరికా, దక్షిణ కొరియాకు వ్యతిరేకంగా క్షిపణి పరీక్షలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు చనిపోతుంటే చూస్తూ.. ఏం ఆనందం పొందుతావు కిమ్ అంటూ.. సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.