అమెరికాపై కిమ్ ఆఖరి అస్త్రం మ‌మూలుగా లేదు

Update: 2017-12-15 11:54 GMT
అగ్ర‌రాజ్యం అమెరికాపై త‌న‌దైన శైలిలో బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న నార్త్ కొరియా ర‌థ‌సార‌థి కిమ్ జోంగ్ ఉన్ మ‌రో సంచ‌ల‌న చ‌ర్య‌కు తెర‌తీశాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇరు దేశాల మ‌ధ్య‌ యుద్ధ‌వాతావ‌ర‌ణం తారాస్థాయికి చేరిపోతుండ‌టం ...వీటిని చ‌క్క‌దిద్దేందుకు ఐక్య‌రాజ్య‌స‌మితి రంగంలోకి దిగిన‌ప్ప‌టికీ...ప‌రిస్థితులు అదుపులోకి రాని సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామాలే క‌ల‌వ‌ర‌ప‌రుస్తుండ‌గా...ఉత్త‌ర‌కొరియా అధికార పత్రిక మింజు చోసోన్ ఈ మేర‌కు సంచ‌ల విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఇప్ప‌టికే అణ్వ‌స్త్ర ప‌రీక్ష‌ల‌తో వణుకు పుట్టిస్తున్న కిమ్ తాజాగా క్రిమి యుద్ధానికి స్కెచ్ వేశాడ‌ని తెలుస్తోంది.

గ‌తంలో మిగతా దేశాల విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ ఇటీవ‌ల కిమ్ త‌న సైన్యంతో పాటు దేశ ప్ర‌జ‌ల‌కు కీల‌క‌మైన ఆదేశాలు జారీచేశాడ‌ని తెలుస్తోంది. అమెరికా స‌హా ఎవ‌రెన్ని కుట్ర‌లు ప‌న్నినా...ఐక్యంగా ఉంటామ‌ని పేర్కొంటూ..ఒక‌వేళ అమెరికా యుద్ధం కోసం సిద్ధ‌మైతే..ఉత్తర‌కొరియా స‌త్తా చాటుతామ‌ని తాజా రక్షణ వార్షికోత్సవాల్లో కిమ్  స్ప‌ష్టం చేసిన‌ట్లు ఆ వ్యాసం పేర్కొంది. `మ‌న‌ల్ని రెచ్చ‌గొట్ట‌డం ద్వారా - బ్లాక్‌ మెయిలింగ్‌ - బయటపెట్టడం ద్వారా ట్రంప్ యుద్ధానికి కాలు దువ్వుతున్నాడు. కానీ అమెరికా తలరాత ఇక ఉత్తరకొరియా చేతుల్లోనే ఉంది. త‌న తీరుతో దేశానికి ముప్పు తెచ్చుకుంటున్న ట్రంప్ ఇక మ‌ర‌ణ‌శ‌య్య‌పైనే ఉన్న‌ట్లు` అని అధికారిక ప‌త్రిక పేర్కొంది.

ఈ సంద‌ర్భంగా కిమ్ త‌గులోని కొత్త అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. కేవ‌లం అణ్వాయుధాల మీద‌నే కాకుండా మ‌రో ర‌కంగా కూడా కిమ్ యుద్ధానికి సిద్ధ‌మయ్యాడ‌ని అంటున్నారు. భ‌యంక‌ర‌మైన క్రిమి యుద్ధానికి కిమ్ స్కెచ్ వేశాడ‌ని....ఇందుకోసం శాస్త్రవేత్తలను ప్రోత్సహించి ప్రమాదకరమైన సూపర్ జెమ్స్‌ తయారు చేయించాడని అమెరికన్‌, ఆసియన్‌ ఇంటెలిజెన్స్‌ నివేదికలు వెల్ల‌డిస్తున్నాయి. యుద్ధం చేసే స‌మ‌యంలో ప‌రిస్థితి చేజారుతుందనుకుంటే  ఆఖరి అస్త్రంగా సూప‌ర్ జెమ్స్‌ ను ప్ర‌యోగించేందుకు కిమ్ రెడీ అవుతున్న‌ట్లు అంచ‌నా వేస్తోంది. అందుకే కిమ్ ఇంత ధైర్యంగా యుద్ధానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడ‌ని వివ‌రిస్తోంది.
Tags:    

Similar News