ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్లరేదు. ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన పాలకుడిగా ఇప్పటికే ఆయన నిలిచాడు. అంతేనా అగ్ర రాజ్యం అమెరికా, ఉత్తర కొరియా పొరుగు దేశాలు జపాన్, దక్షిణ కొరియాలకు పక్కలో బల్లెంలా తయారయ్యాడు. తరచూ అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలు చేస్తూ ఆ దేశాలకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు.
కాగా కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఆయన భార్య ఎవరు, పిల్లలు ఎంతమంది? వాళ్లు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఇలాంటి విషయాలన్నీ ఇప్పటిదాకా వెలుగు చూడలేదు. ఎందుకంటే సోషల్ మీడియా మాధ్యమాలు సహా వార్తా సంస్థలన్నీ ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా మీడియా హద్దులు దాటితే అత్యంత దారుణమైన శిక్షలు అక్కడ విధిస్తారు.
ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా విషయాలు ఎవరికీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు తన కూతురిని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేయడం సంచలనంగా మారింది.
ఉత్తర కొరియా వాసాంగ్–17 అనే ఖండాంతర క్షిపణిని నవంబర్ 18న పరీక్షించింది. ఈ సందర్భంగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని పరిశీలించేందుకు కిమ్ జోంగ్ ఉన్ వెళ్లాడు. అయితే అతడితోపాటు ఒక చిన్నారి ఆయన చేయి పట్టుకుని వెళుతున్న ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఆ చిన్నారి చెయ్యి పట్టుకుని మరీ క్షిపణి ప్రయోగ ప్రాంగణం అంతా కిమ్ కలియదిరుగుతూ పరిశీలించాడు. ఈ ఇద్దరూ క్షిపణి ప్రయోగ వేదిక వద్ద హల్ చల్ చేసిన ఫొటోలు కొరియా న్యూస్ ఏజెన్సీ ద్వారా బయట ప్రపంచానికి వెల్లడి అయ్యాయి. అయితే ఆ చిన్నారి పేరును ఉత్తర కొరియా మీడియా ప్రకటించలేదు. అయితే తన కుమార్తెను కిమ్ జోంగ్ ఉన్ తొలిసారి మీడియాకు ముందు.. అందులోనూ ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని వీక్షించడానికి తీసుకురావడం విశేషంగా మారింది.
ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ సంతానం గురించి సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. కిమ్‌కు ముగ్గురు సంతానమని.. అందులో ఇద్దరు అమ్మాయిలేనని తాజాగా కథనాలు వచ్చాయి. సెప్టెంబర్‌లో నేషనల్ హాలీడే సందర్భంగా పిల్లలతో కిమ్ జోంగ్ ఉన్ సరదాగా గడిపారు. ఆ పిల్లల్లో కిమ్ జోంగ్ ఉన్ పిల్లలు కూడా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.