ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ దేశంలో సరికొత్త నిషేధాన్ని విధించారు. ఎవరూ స్కిన్ జీన్స్ వేసుకోవద్దని.. ముల్లెట్ ధరించవద్దని నిషేధం విధించారు. పాశ్చాత్య పోకడలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తరకొరియాలో చిరిగిపోయిన జీన్స్, నినాదాల టీషర్ట్స్, ముక్కు, పెదాలపై రింగులు ఉండకూడదని నియంత కిమ్ నిషేధం విధించారు. అమెరికా తరహా పోకడలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని.. యువత తన ప్రాభవం కోల్పోతోందని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే యువతలో విప్లవాలు, నిరసనలు రాకుండానే కట్టడి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పాశ్చత్యా సంస్కృతి అలవడితే దేశంలో తన పాలనపై వ్యతిరేకత వస్తోందనే కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక 15 హెయిర్ కట్స్ మాత్రమే కొరియాలో అనుమతించాడు. దేశంలో పాశ్చాత్య దేశాల జీన్స్, మినీ స్కర్ట్, టీషర్ట్, హెయిర్ స్టైల్ లను పౌరులు అనుసరించవద్దని స్పష్టం చేశారు.
ఉత్తరకొరియా ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘిస్తే వారిని పెట్టుబడిదారుల అనుకూలురుగా భావించి కఠిన చర్యలు తీసుకుంటామని కిమ్ జాంగ్ హెచ్చరికలు జారీ చేశారు.