దాయాది దేశం దక్షిణ కొరియాతో మైత్రికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉంగ్ స్నేహ హస్తం అందించేందుకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో కిమ్ చరిత్రాత్మక కరచాలనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇరుదేశాల మధ్య శాంతి గ్రామం పాన్ మున్ జోమ్ లో జరిగిన `ఇంటర్ కొరియన్ సమ్మిట్ ` లో కిమ్ - మూన్ లు కలుసుకోబోతున్నారు. అయితే, ఆ సందర్భంగా ఆ సమ్మిట్ జరిగే ప్రాంతంలోకిమ్ ప్రయాణిస్తున్న కారు వెంట ఆయన భద్రతా సిబ్బంది జాగింగ్ చేస్తోన్న వీడియా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దర్జాగా కిమ్ కూర్చున్న కారు పక్కనే ఆయన సెక్యూరిటీ గార్డులు జాగింగ్ చేయడం చర్చనీయాంశమైంది. ఆ సెక్యూరిటీ గార్డులంతా యూనిఫార్మ్ లు ధరించి అంతే యూనిఫార్మ్ గా కిమ్ కారు పక్కన పరిగెడుతున్న దృశ్యాలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉంగ్ నియంతృత్వ ధోరణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనకు నచ్చిందే చట్టం...అన్న రీతిలో వ్యవహరించడం కిమ్ కు పరిపాటి. అయితే, ఆ సమ్మిట్ సందర్భంగా కిమ్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిమ్ కారు వేగాన్ని అందుకోవడానికి ఆ సెక్యూరిటీ గార్డులు....జాగింగ్ చేస్తు నానా ఇబ్బందులు పడ్డారు. కారు ఆగిన తర్వాత కిమ్..అందులోనుంచి దర్జాగా దిగి చిద్విలాసంతో బయటకు వచ్చారు. ఇది చూసి కిమ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తోన్న కిమ్....ఆఖరికి తన భద్రతా సిబ్బందిని కూడా టార్చర్ పెడుతున్నాడని కామెంట్స్ వస్తున్నాయి. కిమ్ ఓ నియంత అని....అతడి వ్యవహార శైలిలో మార్పు వస్తుందనుకోవడం హాస్యాస్పదమని కొందరు విమర్శించారు. మొత్తానికి కిమ్ `జాగింగ్ బాడీగార్డ్స్` వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View