భ‌యంక‌రంగా న్యూఇయ‌ర్ విషెస్ చెప్పిన కిమ్‌

Update: 2018-01-01 06:42 GMT

అగ్ర‌రాజ్యం అమెరికా అధిప‌తి డొనాల్డ్ ట్రంప్ ప్ర‌పంచం అంత‌టికీ కొర‌క‌రాని కొయ్య అంటే....ఆయ‌న‌కే బీపీ పెంచే తిక్కున్నోడు కిమ్ జాంగ్ ఉన్‌. త‌న తిక్క‌కు ఓ లెక్క ఉంద‌ని చెప్పుకునే కిమ్ తాజాగా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ను సైతం త‌న బెదిరింపుల‌కు వాడుకున్నారు. కొత్త సంవ‌త్స‌రం శుభాకాంక్ష‌లు చెప్తూనే..క‌ల‌క‌లం రేకెత్తించే బెదిరింపుల‌కు దిగారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌. ఈ సంద‌ర్భంగా అణ్వస్త్ర స‌త్తాతో అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు.

నూతన సంవత్సర ప్రసంగంలో కొరియా ద్వీపకల్పంలో శాంతి భద్రతలను కొనసాగించేందుకు భద్రతా దళాల ఒత్తిడిని తగ్గిస్తున్నట్లు కిమ్ వెల్ల‌డించారు. , దక్షిణ కొరియాతో శాంతియుత వాతావరణం కొనసాగేలా ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తన టేబుల్‌ దగ్గర ఎప్పుడూ అణ్వాస్త్రాలను ప్రయోగించే బటన్‌ ఉంటుందని అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. `ప్రపంచంలోని ఏ శక్తీ ఉత్తరకొరియా  జోలికి రాకుండా చూసుకోవాలి. అణ్వస్త్రాల తయారీని మనం ఇంకా వేగవంతం చేయాలి. ఖండాంతర క్షిపణులను పెద్ద ఎత్తున మోహరింపజేయాలి` అని సందేశం ఇచ్చారు.

కాగా, కిమ్ సందేశానికి ముందే..త‌న అణ్వ‌స్త్ర విధానాన్ని ఉత్త‌ర‌కొరియా స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. అమెరికా, దాని అనుబంధ దేశాల నుంచి ముప్పు ఉన్నంత కాలం తాము న్యూక్లియర్‌  మిస్సైళ్లను అభివృద్ధి చేస్తూనే ఉంటామని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. 2018 లోనూ అణుశక్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రకటించింది. తమ విధానాల్లో మార్పులు ఉండవని, అంచనా వేయాల్సిన అవసరం లేదని ప్రపంచ దేశాలకు తెలిపింది. ఈ మేరకు ఆ దేశ అధికార మీడియా ఏజెన్సీ కొరియన్ సెంట్రల్ న్యూస్ కథనాన్ని ప్రచురించింది. ఏ శక్తి మమ్మల్ని బలహీన పరచలేదంటూ ఇండైరెక్టుగా అమెరికాకు కౌంటర్‌ ఇచ్చింది.

ఇదిలాఉండ‌గా...పామ్‌ బీచ్‌ లో నూతన సంవత్సర పార్టీలో ప్ర‌సంగిస్తూ కిమ్ వ్యాఖ్య‌ల‌కు డొనాల్డ్ ట్రంప్ రియాక్ట‌య్యారు. తాము అద్భుతమైన 2018 సంవత్సరంలోకి అడుగుపెట్టామని ఆయ‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ' చూద్దాం...చూద్దాం' అంటూ సమాధానాన్ని దాటవేశారు. త‌ద్వారా త‌న‌దైన దూకుడుకు భిన్నంగా ట్రంప్ రియాక్ట్ అయ్యారు.
Tags:    

Similar News