ఢిల్లీ కమలంలో కిరణ్‌బేడీ మంట రాజుకుంది

Update: 2015-01-20 07:34 GMT
కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిగా భిన్నం. అసలు ఆ పార్టీతో మాకు పోలికేంది? మా పార్టీకి ఉన్నంత క్రమశిక్షణ.. కమిట్‌మెంట్‌ వృద్ధ కాంగ్రెస్‌లో ఎక్కడున్నాయంటూ కమలనాథులు తెగ గొప్పలు చెప్పేసుకుంటారు.

అధికారం దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినప్పటికీ.. చేతికి పవర్‌ వస్తే.. ప్రతి పార్టీలోనూ ఎంతోకొంత లల్లి తప్పదన్న విషయం తాజాగా మరోసారి రుజువైంది.

ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్‌బేడీని ఎంపిక చేయటంపై ఇప్పటివరకూ మాటల్లో వినిపించిన అసమ్మతి.. చేతల్లోకి వచ్చేసింది. కిరణ్‌బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించటంతో పార్టీలో నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ తీరుపై విమర్శలు చేసిన వారికి వార్నింగ్‌ ఇస్తున్న పరిస్థితుల్లో.. ఊహించని విధంగా పార్టీ కార్యాలయం బయట ఏర్పాటు చేసిన కిరణ్‌బేడీ హోర్డింగ్‌ను ధ్వంసం చేశారు. పార్టీకి తిరుగులేని నేతగా కీర్తించబడుతున్న మోడీ సైతం సదరు హోర్డింగ్‌లో ఉన్నారు. హోర్డింగ్‌పై ఉన్న కిరణ్‌బేడీ.. పార్టీ ఢిల్లీ చీఫ్‌ సతీష్‌ ఉపాధ్యాయ ముఖాలను పూర్తిగా కత్తిరించేయటం గమనార్హం.

బీజేపీలో చేరే ముందు కిరణ్‌బేడీ హోర్డింగ్‌నుపార్టీ కార్యాలయం బయట ఏర్పాటు చేశారు. ఎన్నికల వేళ.. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి డిటో అన్నట్లుగా బీజేపీ నేతలు వైఖరి ఉండటంపై పార్టీ అధినాయకత్వం కాస్తంత గాబరాతో ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. మోడీ అండ్‌ కో ఈ అసంతృప్తి నుంచి ఎలా బయటకు వస్తారో చూడాలి.
Tags:    

Similar News