బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముంబై తీరంలో విలాసవంతమైన క్రూయిజ్ షిప్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఆర్యన్ ఖాన్ సహా అతడి స్నేహితులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆరోజు షిప్ లో ఆర్యన్ తో సెల్ఫీలు, వీడియోలు తీసుకొని విడుదల చేసిన వ్యక్తి హాట్ టాపిక్ గా మారాడు. అతడే కిరణ్ గోస్వామి. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తోపాటు సెల్ఫీలు తీసుకున్న వ్యక్తి తనకు ప్రాణహాని ఉందని.. మహారాష్ట్ర ప్రభుత్వం , పోలీసులపై తనకు నమ్మకం లేదని.. వేరే రాష్ట్రంలోని పోలీసుల ముందు లొంగిపోతానని ప్రకటించాడు.
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న కిరణ్ గోస్వామి తాజాగా అరెస్ట్ అయ్యాడు. ముంబైలోని క్రూయిజ్ పై ఎన్సీబీ దాడుల తర్వాత గోస్వామి ఆర్యన్ ఖాన్ తో తీసుకున్న సెల్ఫీ వైరల్ అయ్యింది. తమ ఏజెంట్లలో కిరణ్ గోస్వామి ఒకరిని ఎన్సీబీ చెప్పింది.
అయితే అతడిపై 2018లో ఒక ఫ్రాడ్ కేసు కూడా నమోదైంది. ఛార్జిషీట్ కూడా ఫైల్ చేశారు. అంతేకాకుండా కిరణ్ పై లుకౌట్ నోటీసు కూడా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఫూణె పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ అరెస్ట్ తర్వాత అదే షిప్ లో అతడితోపాటు సెల్ఫీలు తీసుకున్న కిరణ్ గోస్వామి మాయం అయిపోయాడు. ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీలు తీసుకున్న వ్యక్తిని పట్టుకోవడానికి ఎన్సీబీ అధికారులు లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇలాంటి సమయంలో ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీలు తీసుకున్న వ్యక్తి లొంగిపోతానని స్టేట్ మెంట్ ఇవ్వడం కలకలం రేపింది.
ఇక కిరణ్ గోస్వామి ఎన్సీబీ అధికారులకు రూ.25 కోట్ల లంచం ఇవ్వాలని పలువురికి చెప్పాడని ఆరోపణలు వచ్చాయి. బెయిల్ పిటీషన్ విచారణ సమయంలో తాను లొంగిపోతానని కిరణ్ తెలుపడం హాట్ టాపిక్ గా మారింది. ఆర్యన్ తో సెల్ఫీలు తీసుకున్న కిరణ్ ఈ కేసు క్లోజ్ చేయడానికి ఎన్సీబీ అధికారులకు రూ.25 కోట్లు లంచం ఇస్తానని.. ఇంతటితో ఈ కేసు రాద్ధాంతం ముగిసిపోతుందని పలువురికి చెప్పాడని ఆరోపణలున్నాయి. అయితే ఈ ఆరోపణలను కిరణ్ ఖండించారు. తాజాగా అరెస్ట్ తో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.