ఉమ్మడి ఏపీ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీ పెద్దలు తాజాగా పిలిపించారు అన్నది తాజా వార్త. కాంగ్రెస్ అధినాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కిరణ్ ని ఢిల్లీకి రమ్మని కోరారని చెబుతున్నారు. ఈ ఆకస్మిక పిలుపు ఎందుకు అని ఆరా తీస్తే ఆయనకు కాంగ్రెస్ పార్టీలో అతి పెద్ద పదవి ఇచ్చి దక్షిణ భారత దేశంలోని పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు.
అంటే కిరణ్ దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తిరిగి కాంగ్రెస్ ని పటిష్టం చేస్తారు అని అధినాయకత్వం భావిస్తోంది. కిరణ్ ని ముందు పెట్టి కాంగ్రెస్ రాజకీయం చేయాలనుకోవడం వెనక పెద్ద వ్యూహమే ఉంది అంటున్నారు.
ఎందుకంటే ఏపీ, తెలంగాణా, కర్నాటకలో రెడ్డి సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉంది. వీరిని అందరికీ ఒక తాటి మీదకు తీసుకురావాలీ అంటే మాజీ సీఎం గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి వంటి ఉన్నత స్థాయి కలిగిన వారు కావాలన్నదే కాంగ్రెస్ ఆలోచన.
ఇక ఊరికే తిరగమని అంటే ఏ లీడరూ తిరగరు, దాంతో కిరణ్ కుమార్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కల్పించి సౌత్ ఇండియా బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ గేర్ మార్చవచ్చు అని భావిస్తున్నారు. ఇలా టోటల్ బాధ్యతలు అప్పగించడం వల్ల ఏపీ, తెలంగాణాతో పాటు, కర్నాటకలో కూడా కిరణ్ విసృతంగా ఆయన తిరిగేందుకు అవకాశం ఉంది. ఇక తమిళనాడు బోర్డర్ లో కూడా పెద్ద ఎత్తున రెడ్డి సామాజికవర్గం ఉన్నారు. వారిని కూడా ఆకట్టుకోవచ్చు. ఇలా కిరణ్ కి పదవి ఇవ్వడం కాంగ్రెస్ కి ప్లస్ అవుతుంది అంటున్నారు.
ఇక తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ కి అనుకూలమైనది, మిత్రపక్షం కూడా. యూపీఏలో డీఎంకే కీలకమైన బాగస్వామురాలు అన్న సంగతి తెలిసిందే. ఇదే తీరున కేరళలో కూడా కొంచెం మంచి నాయకులను ముందు పెట్టి కధ నడిపితే దక్షిణ భారతాన కాంగ్రెస్ కి పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు వస్తాయన్న ఆశలు, అంచనాలు ఉన్నాయని అంటున్నారు.
ఇలా కాంగ్రెస్ కి ఆశాకిరణంగా కిరణ్ కుమార్ రెడ్డి కనిపిస్తున్నారు. నిజానికి ఆయన్ని ఏ చరిష్మా లేకుండా మూడేళ్ళ పాటు సీఎం ని కాంగ్రెస్ చేసింది. ఇపుడు కాంగ్రెస్ రుణం తీర్చుకోవాల్సిన సందర్భం అయితే వచ్చింది. పైగా కాంగ్రెస్ మంచి పదవితో గౌరవిస్తే దాన్ని అందిపుచ్చుకుని తన మలి విడత రాజకీయానికి కిరణ్ కూడా బాటలు వేసుకోవచ్చు. ఏది ఏమైనా కిరణ్ కూడా జాతీయ స్థాయిలో వెలగాలని కోరుకుంటున్నారు. దాంతో కాంగ్రెస్ ఇస్తున్న ఈ బిగ్ ఆఫర్ ఆయనకు కూడా మేలు చేస్తుంది అంటున్నారు.