సోషల్ మీడియాలో ఇప్పుడు ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే అక్షయ్ కుమార్, సోనూసూద్, సుస్మితా సేన్, సీనియర్ నటుడు అర్జున్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ చాలెంజ్ ను స్వీకరించి అదరగొట్టారు. అయితే ఇప్పుడు ఈ ఛాలెంజ్ రాజకీయ నేతలకు కూడా పాకింది.
కేంద్ర క్రీడల సహాయ మంత్రి కిరణ్ రిజిజు బాటిల్ క్యాప్ ఛాలెంజ్ స్వీకరించి ఒక సీసా మూతను కాలితో తెరిచాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఫేస్ బుక్ , ట్విట్టర్ ఖాతాల్లో పోస్టు చేశారు.
-ఈ చాలెంజ్ లో ఏం చేస్తారు?
ముందుగా ఓ బాటిల్ ను టేబుల్ పై పెట్టాలి. బాటిల్ మూతను కాస్త వదులుగా ఉంచాలి. అనంతరం దానికి కొంచెం దూరంలో నిలబడి బాటిల్ కిందపడకుండా కేవలం దాని మూత మాత్రమే ఊడిపోయేలా కాలితో తన్నాలి. అయితే ఇది అంత ఈజీ ఛాలెంజ్ కాదు. దీనికి టెక్నిక్ కావాలి.
ఫిట్ నెస్ ఉండాలి. అందుకే ఈ ఫిట్ నెజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారనే పేరున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ చాలెంజ్ ను ఈజీగా చేశారు.
సోషల్ మీడియా వచ్చాక ప్రతీ ఛాలెంజ్ కూడా వైరల్ అవుతోంది. ఇప్పటికే ‘ఫిట్ నెస్ ఛాలెంజ్’, గ్రీన్ ఛాలెంజ్ వంటివి తెరమీదకు వచ్చాయి. ఇప్పుడు ఇదే తరహాలో ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ హల్ చల్ చేస్తోంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ ఇప్పుడీ ఛాలెంజ్ ను ఫాలో అవుతున్నారు.
యువతకు మెసేజ్ ఇచ్చే ఉద్దేశంతో కిరణ్ రిజిజు ఈ ఛాలెంజ్ ను స్వీకరించారు. ఆయన ఈ ఛాలెంజ్ ద్వారా యువతకు ఓ సందేహం కూడా ఇచ్చారు. యువతే మన దేశ భవిష్యత్ , మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి అని.. ఆరోగ్య భారత్ ప్రచారానికి సిద్ధం కండి అని కిరణ్ రిజిజు పిలుపునిచ్చారు. ఏకాగ్రత దృష్టితో విజయం సాధ్యమన్నారు. మంచి ఆరోగ్యంతో చాలా సంతోషకరమైన జీవితం గడపవచ్చు అని కిరణ్ రిజిజు యువతకు సందేశమిచ్చారు.