కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హిందువుల జనాభా క్రమంగా తగ్గడంపై తనదైన శైలిలో విశ్లేషణ చేసిన రిజిజూ...హిందువులు ఎవరినీ బలవంతంగా మతమార్పిడికి ఒత్తిడి తీసుకురారని, అందుకే క్రమంగా దేశంలో హిందువుల సంఖ్య తగ్గుతున్నదని అన్నారు. అదే సమయంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో మైనార్టీల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నదని ఆయన ట్విట్టర్ లో అభిప్రాయపడ్డారు. ఇండియా ఓ లౌకికవాద దేశమని, ఇక్కడ అన్ని మతాలవాళ్లు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవిస్తున్నారని రిజిజు అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ ను హిందువుల రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారన్న కాంగ్రెస్ ఆరోపణలకు బదులుగా ఆయన ఈ ట్వీట్స్ చేశారు. అంతేకాకుండా తన ట్వీట్స్‌పై వివరణ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ చాలా బాధ్యతారహిత వ్యాఖ్యలు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇలాంటి రెచ్చగొట్టే కామెంట్స్ చేయకూడదని రిజిజు అన్నారు. ప్రశాంతంగా జీవిస్తున్న అరుణాచల్ ప్రదేశ్ వాసులను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ ఎందుకు మాట్లాడుతున్నదని ఆయన ప్రశ్నించారు. తమ రాజకీయాల కోసం దేశంలో చిచ్చు పెట్టే ఆలోచనను ఇకనైన కాంగ్రెస్ వదులుకోవద్దని ఆయన సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/