కేసీఆర్ బ‌స్తీమే స‌వాల్ అంటున్న బీజేపీ

Update: 2017-05-25 14:33 GMT
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమ‌ర్శల‌పై భాజపా శాసనసభ పక్ష నేత కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణకు లక్ష కోట్ల కంటే ఎక్కువే ఇచ్చిందని పున‌రుద్ఘాటించారు. కేంద్ర నిధుల పై చర్చకు బీజేపీ సిద్ధమ‌ని పున‌రుద్ఘాటించారు. పార్లమెంట్, అసెంబ్లీ లో ఎక్కడైనా చర్చకు సిద్ధమ‌ని బీజేపీ నేత‌లు స్ప‌ష్టం చేశారు. రాజీనామా చేస్తానన్న ప్రకటనకు కేసీఆర్ కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ‌లో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అమిత్ షా ఎక్కడా సీఎం కేసీఆర్‌ పేరు ప్రస్తావించలేద‌ని బీజేపీ నేత‌లు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ విలేక‌రుల స‌మావేశంలో అమిత్ షా పేరును ప్ర‌స్తావిస్తూ కేసీఆర్ ఉపయోగించిన భాష ఆక్షేపణీయమ‌ని అన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్లు ఇస్తుందన్న అమిత్ షా ప్రకటనకు కట్టుబడి ఉన్నామ‌ని, మధ్యవర్తిని పెడితే నిరూపిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని కేసీఆర్ అనడం హాస్యాస్పదమ‌ని తెలంగాణ బీజేపీ నేత‌లు అన్నారు. క్షమాపణ చెప్పాల్సింది కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలు అమలు చేయనందుకు రైతులు, సింగరేణి కార్మికులు, ఒప్పంద కార్మికులకు, మహిళలకు క్షమాపణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ ద్రోహులను మంత్రివర్గంలో చేర్చుకున్నందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 17 ఉత్సవాలు జరపనందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ తో తెలంగాణ రాలేదని పార్లమెంట్ లో భాజపా మద్దతు వల్లే తెలంగాణ వచ్చిందని బీజేపీ నేత‌లు వ్యాఖ్యానించారు. పోలవరం మండలాలను అక్రమంగా భాజపా ప్రభుత్వం ఆంధ్రలో కలిపారనడం నిజంకాదని, ఆ మండలాలను కలిపింది కాంగ్రెస్సేనని తెరాస ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిందని అన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే నిజాం చక్కెర ఫ్యాక్టరీ ని టేకోవర్ చేయాలి. కేసీఆర్ కు ముందుంది ముసుర్ల పండుగ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడమ‌ని స్ప‌ష్టం చేశారు. అమిత్ షా ను ఛాలెంజ్ చేసే అర్హత ఒవైసీ కి లేదని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News