బ్రేకింగ్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Update: 2019-05-30 06:37 GMT
అనుకున్నట్టే అంచనాలు నిజమయ్యాయి. తెలంగాణకు కేంద్రమంత్రి పదవి దక్కబోతోందని సమాచారం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో గెలిచిన ఏకైక ఎంపీ దత్తాత్రేయకు మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి దక్కింది. కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి విషయంలో ఆయన జోక్యం చేసుకొని మంత్రి పదవి పోగొట్టుకున్నాడు. అనంతరం తెలంగాణ నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అది చాలా విమర్శలకు దారితీసింది.

అయితే ఈసారి తెలంగాణలో 2019 ఎన్నికల్లో నలుగురు ఎంపీలుగా గెలవడం విశేషం. ఇందులో ముగ్గురు కొత్త వారు కాగా.. కిషన్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్.. కిషన్ రెడ్డి మోడీ బ్యాచ్ మేట్. ఆర్ఎస్ఎస్ లో పనిచేసినప్పుడు ఇద్దరు కలిసి పనిచేశారు. ఆ పరిచయంతోనే లాబీయింగ్ చేసి సికింద్రాబాద్ సీటును తెప్పించుకొని పోటీచేసి గెలిచారు.

ఇప్పుడు కేంద్రమంత్రివర్గ విస్తరణలో తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డికి సీటు కన్ఫం చేసినట్టు సమాచారం. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కిషన్ రెడ్డి ఫోన్ చేసినట్టు బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. మోడీ మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డిని తీసుకుంటున్నట్టు తెలిసింది. హోంశాఖ సహాయ మంత్రి పదవిని కిషన్ రెడ్డికి కట్టబెట్టబోతున్నట్టు సమాచారం.

ఇదివరకు తెలంగాణలోని కరీంనగర్ ఎంపీగా గెలిచిన విద్యాసాగర్ రావు వాయిపేజ్ ప్రభుత్వంలో హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. దేశంలోనే నంబర్ 1శాఖకు సహాయ మంత్రి పదవి అంటే చిన్నది కాదు.. ఇప్పుడు ఆ పెద్ద పదవి కిషన్ రెడ్డి దక్కుతుండడం.. విద్యాసాగర్ రావు వలే హోంశాఖ సహాయమంత్రి పదవి కిషన్ రెడ్డికి దక్కడం విశేషంగా మారింది. రెండు సార్లు తెలంగాణ ఎంపీలకు హోంశాఖ సహాయ మంత్రి పదవులే దక్కడం ఆసక్తిగా మారింది.


Tags:    

Similar News