మందుబాబులకు కేంద్రం బ్యాడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ నియమాలలో ఏప్రిల్ 20 తరువాత సడలింపు ఇవ్వబోతున్నారు అని తెలియడంతో మద్యం అమ్మకాలపై ఈ నెల 20 తేదీ సడలింపులు ఉంటాయని, మద్యం దొరుకుతుందేమోనని ఆశపడ్డ మందు బాబులకు మోదీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. మద్యం అమ్మకాలకు సడలింపు ఇవ్వబోమని, వైన్ షాపులు తెరుచుకోవని స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి దీని పై క్లారిటీ ఇచ్చారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏప్రిల్ 20 తర్వాత ఇవ్వనున్న సడలింపులో మద్యం దుకాణాలు లేవు. మద్యం రోగ నిరోధక శక్తిని చంపేస్తుంది. అందుకే కేంద్రం ఎలాంటి సడలింపు ఇవ్వడం లేదు. అమ్మకాలపై నిషేధం విధిస్తూ మార్గదర్శకాలిచ్చాం కూడా. కానీ, కొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్‌లో మద్యం అమ్మాలని చూస్తున్నాయి. వాటిపై నిర్ణయం రాష్ట్రాలదే అని తేల్చి చెప్పారు. గ్రీన్ జోన్లలో ఆంక్షలను తొలగించనున్నట్లు చెప్పిన ఆయన, కొన్ని దుకాణాలు, నిర్మాణ పనులు వంటివి చేసుకోవడానికి సడలింపులు ఇస్తున్నట్లు చెప్పారు.
దేశంలో ఇంకా కొన్ని చోట్ల డాక్టర్ల మీద, వైద్య సిబ్బంది మీద ఇంకా కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయని, ఇది సిగ్గుచేటని ఆయన అన్నారు. డాక్టర్లు చనిపోతున్నా కూడా.. ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడుకున్నారని వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం మీద వుందని కిషన్ రెడ్డి సూచించారు. అలాగే , డాక్టర్ల మీద దాడులు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాం.. వలస కూలీలు ఏ రాష్ట్రాల్లో ఉంటే ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వలు ఏర్పాటు చేయాలి అని అయన కోరారు.