మాజీమంత్రి ఇలా బుక్క‌య్యాడేంటి?

Update: 2017-10-22 09:17 GMT
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు - మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదు అయింది. తనకు వ్యతిరేకంగా పనిచేసే వారిని పోలీసు కేసుల్లో ఇరికించాలనే కుట్ర చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. మాజీ మంత్రిపై ఇలాంటి కేసు న‌మోద‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

పోలీసులు  - బాధితుల కథనం మేరకు ... కరీంనగర్ పెద్దపల్లి జిల్లాకు చెందిన ముత్తారం మండలంలో 9 ఎకరాల స్థలాన్ని కాజేసేందుకు మాజీ మంత్రి ప్రయత్నిస్తుండడంతో దానిని స్థానిక టీఆర్‌ ఎస్ ఎంపీటీసీ కవిత భర్త - ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి అడ్డుకున్నాడు. దీంతో అప్పటి నుంచి అతనిపై శ్రీధర్‌ బాబు కక్షగట్టారు. ఈ క్రమంలోనే ఆగస్టు నెలలో వినాయక చవితిరోజు కిషన్‌ రెడ్డిపై కేసు పెట్టేందుకు ప్రయత్నించారు. ఇందులో భా గంగా సుదర్శన్ అదే గ్రామానికి చెందిన భార్గవ్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి - కిషన్‌ రెడ్డి ఇంట్లో గంజాయి ప్యాకెట్లు వేయాలని సూచించారు. ఈ విషయం తెలుసుకొని అప్రమత్తమైన కిషన్‌ రెడ్డి నగర పోలీస్ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశాడు. దానిపై స్పందించిన సదరు అధికారి నుదర్శన్ - భార్గవ్‌ లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని జరిగిన విషయంపై ఆరా తీశారు. అయితే దోమలగూడలోని శ్రీధర్‌ బాబు ఇంట్లోనే సుదర్శన్ - భార్గవ్‌ తో కలిసి కుట్ర పన్నారని బాధితుడు కిషన్‌ రెడ్డి చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు - భార్గవ్‌ పై కేసులు నమోదు చేశారు.
Tags:    

Similar News