బీజేపీని గెలిపిస్తే.. ధాన్యం మొత్తం కొంటాం: కిషన్ రెడ్డి నిజం చెప్పేశారు!
ధాన్యం విషయంలో అటు కేంద్రానికి, ఇటు రాష్ట్ర కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య తీవ్ర యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇంకా ఈ విషయంలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మీరు మొత్తం ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని.. కేసీఆర్ చెబుతుంటే.. అలా జరగదని కేంద్రం స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే.
దీంతో కేసీఆర్ రాష్ట్రంలోనూ.. ఢిల్లీలోనూ ఉద్యమాలకు సిద్ధమైన విషయం.. కొన్ని ముందుకు సాగిన విషయం తెలిసిందే. అయితే..తాజాగా వరంగల్‌లో జరిగిన బీజేపీ సభలో కేంద్ర మంత్రి, తెలంగాణ నాయకుడు కిషన్‌రెడ్డి ఈ విషయంలో నిజాలు కక్కేశారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తుందని ఆయన సంచలన ప్రకటన చేశారు. వరం గల్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్‌ను మంజూరు చేసిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సైనిక్ స్కూల్ నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం భూమి కేటాయించటం లేదని ఆరోపించారు.
ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమ వుతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కిషన్ రెడ్డి.. బీజేపీని గెలిపిస్తే రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొంటుందని స్పష్టం చేశారు.
మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మా ణానికి కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందని తెలిపారు. రహదారుల కోసం మొత్తం రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్న ఆయన.. యాదాద్రి నుంచి వరంగల్‌కు రూ.388 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించిందని గుర్తు చేశారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.
అన్నీ కేంద్రమే చేస్తోంది..
వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.196 కోట్లు ఇచ్చిందని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా మరో రూ.196 కోట్లను కేసీఆర్ ఇవ్వలేదని ఆరోపించారు. వరంగల్‌లో కుర్చీ వేసుకుని కూర్చుని అభివృద్ధి చేస్తానని గతంలో పేర్కొన్న కేసీఆర్.. ఫామ్‌హౌజ్‌ను వీడింది లేదు, వరంగల్‌లో అభివృద్ధి చేసింది లేదని దుయ్యబట్టారు. వరంగల్ జిల్లాలోని ఆలయాలనూ కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. కూలిపోయే దశలో ఉన్న కాకతీయుల కళా మండపాన్ని పట్టించుకోలేదన్న కిషన్‌రెడ్డి.. ఆ మండపాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆధునీకరిస్తోందని తెలిపారు.