నిజమే... తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీసుకున్న చొరవతో నల్లగొండ జిల్లాకు చెందిన పండ్ల తోటల రైతులకు బిగ్ బూస్టిచ్చిందనే చెప్పాలి. సరిగ్గా పంట చేతికొచ్చిన సమయంలో కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమల్లోకి రాగా... పంటంతా రోడ్డుపాలేనా అన్న భావన వ్యక్తమైతే... కిషన్ రెడ్డి చొరవతోనల్లగొండ రైతుల భూముల్లో పండిన ఒక్కటంటే ఒక్క పండు కూడా వృధా కాకుండా ఉండేలా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ గా ప్రసిద్ధి చెందిన ఢిల్లీలోని అజాద్ పూర్ మండీ ఇకపై 24 గంటలూ నాన్ స్టాప్ గా కార్యకలాపాలు సాగించనుంది. రాత్రి వేళల్లో ఏకంగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఈ మార్కెట్ లో కొనుగోళ్లు జరగనున్నాయి.
ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... నల్లగొండ జిల్లాలో ప్రధాన పంట బత్తాయి అన్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున బత్తాయి పండిస్తున్న ఈ జిల్లా రైతులు తమ పంట ఉత్పత్తులను అజాద్ పూర్ మండీకే తరలిస్తారు. ఈ క్రమంలో ఈ జిల్లా నుంచి అజాద్ పూర్ మండీకి ఏటా 30 వేల మెట్రిక్ టన్నుల బత్తాయి సరఫరా అవుతూ ఉంటుంది. అయితే, ఈసారి బత్తాయి పంట చేతికొచ్చే సమయానికి ఆజాద్‌పూర్ మార్కెట్‌పై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దాంతో పరిమిత సమయం మాత్రమే ఈ మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి వ్యవసాయ సంబంధ మార్కెట్లకు లావాదేవీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నల్గొండ రైతాంగం కాస్త ముందుగానే మార్కెట్‌ని తెరవాలని కోరారు.
దాంతో తెలంగాణ బత్తాయి రైతుల తరపున కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. రైతుల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా చర్చలు జరిపారు. 24 గంటలు మార్కెట్ తెరిచి ఉంచి, రద్దీ లేకుండా అమ్మకాలు సాగేలా ఏర్పాట్లు చేసేందుకు పురమాయించారు. దాంతో రాత్రి పూట కూడా అమ్మకాలకు వీలు కల్పించేలా ఫ్లడ్ లైట్లను అమర్చారు. దాంతో 24 గంటల పాటు లావాదేవీలు నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. నల్గొండ బత్తాయి రైతులు తమ పంటను సరఫరా చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీని 24 గంటలూ తెరిచేలా ఆదేశాలిచ్చామని, నల్గొండ జిల్లా బత్తాయి రైతుల సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకున్నానని, ఇకపై ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రి పూట కూడా మార్కెట్‌లో లావాదేవీలు కొనసాగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. మొత్తానికి కిషన్ రెడ్డి చొరవ నల్లగొండ జిల్లా రైతులకు బిగ్ బూస్టిచ్చిందని చెప్పక తప్పదు.