బీజేపీలో ఈటల చేరికపై స్పందించిన కిషన్ రెడ్డి

Update: 2021-05-25 14:30 GMT
టీఆర్ఎస్ బహషృత నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో తాజాగా బీజేపీ పెద్దలు చర్చలు జరిపారన్న ప్రచారం సాగింది. ఢిల్లీ నుంచి జాతీయ నేత, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వచ్చి ఈటలను బీజేపీలో చేరాలని  చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈటల రాజేందర్ తెలంగాణలో వరుసగా కేసీఆర్ వ్యతిరేకులను కలుస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

తనను కలిసేందుకు మాజీ మంత్రి ఈటల సంప్రదించిన మాట వాస్తవమేనని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు తాను ఈటల రాజేందర్ ను కలువలేదని తెలిపారు. ఫోన్ లో మాత్రమే మాట్లాడానని చెప్పారు. భవిష్యత్ లో ఈటలతో చర్చలు జరుపుతానన్నారు. ఈటలతో కలిసి అసెంబ్లీలో 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని తెలిపారు.

ఈటలను ఎప్పుడు కలవాలన్నది నిర్ణయించుకోలేదని కిషన్ రెడ్డి తెలిపారు. అందరినీ కలుస్తానన్నారు. ఈటల బీజేపీలో చేరిక అంశాన్ని మాత్రం కిషన్ రెడ్డి ప్రస్తావించలేదు. హుజూరాబాద్ కు ఉప ఎన్నిక వస్తే పోటీచేయాలా? వద్దా అనే విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. 
Tags:    

Similar News