పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) - జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయులను విదేశాలకు పంపే అధికారం ఏ ప్రభుత్వనికి ఉండదని - ఇక్కడ ఉన్న ముస్లిం - సిఖ్ - జైన్ - క్రిస్టియన్ లకు ఎలాంటి ఢోకా లేదని కిషన్ రెడ్డి అన్నారు. పాకిస్తాన్ - బంగ్లాదేశ్ - అప్ఘనిస్తాన్ ఇస్లామిక్ దేశాలని.. భారత్ సర్వ మతాల కలయిక గల సెక్యులర్ దేశమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ లోని పద్మరావునగర్‌లో బీజేపీ నేతలు ఆదివారం ‘గృహ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నార్సీ - సీఏఏ - ఎన్పీఆర్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.... సిఏఏ - ఎన్నార్సీలపై అనవసర అపోహలు వద్దని - కాంగ్రెస్ నేతలు చేస్తున్న బూటకపు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇల్లు కాలి ఒకరేడుస్తుంటే.. ఆ మంటల్లో కాంగ్రెస్ చలి కాచుకుంటోందని ఎద్దేవా చేశారు.
భారత మైనారిటీలకు ఈ చట్టంతో ఏ మాత్రం నష్టం లేదని - దేశంలోని ఏ ఒక్కరి పౌరసత్వాన్ని ఇది తొలగించదని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. నాన్‌కానా సాహెబ్‌పై జరిగిన దాడిని గమనించాలని - మన సిక్కు సోదరులు భారత్ కు కాకుండా మరెక్కడికి వెళ్లగలరని ప్రశ్నించారు. పాక్‌లో మత హింస ఎదుర్కొంటున్న మైనారిటీలకు భారత్ కు రావడం ఒక్కటే దారి అన్నారు. శరణార్థులను ఆదుకోవడం, వారికి రక్షణ కల్పించడం కోసం పౌరసత్వం ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కానీ దీన్ని కాంగ్రెస్ - టీఆర్ ఎస్ - మజ్లిస్ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.