మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి సీరియస్ .... ఇక నిధులుకావాలంటూ రండి చెప్తా ...
హైదరాబాద్ మెట్రో అధికారులపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మెట్రో అధికారులతో జరిగిన సమీక్షలో పాల్గొన్న కిషన్ రెడ్డి, అధికారుల వ్యవహార తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ లో మెట్రో నిర్మాణానికి కేంద్రం రూ.1200 కోట్లు ఇస్తే.. కనీసం హోర్డింగుల్లో ఎక్కడా ప్రధాని ఫోటో పెట్టలేదని, కనీసం స్థానిక ఎంపీ అయిన నన్ను కూడా మెట్రో ప్రారంభోత్సవానికి పిలవరా అని ప్రశ్నించారు. అలాగే కేంద్రం మరో రూ.250కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. ఇంకోసారి నిధుల కోసం తమ వద్దకు రావద్దని వార్నింగ్ ఇచ్చారు.
అసలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు మెట్రో ప్రారంభోత్సవం ఎలా చేస్తారు అంటూ ఫైర్ అయ్యారు. తనకు పార్లమెంట్‌లో విప్ ఉందని... కచ్చితంగా సమావేశాలకు హాజరుకావాలని తెలిపారు.
మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని టీఆర్ ఎస్ ఫంక్షన్ లాగా చేస్తారా ? ఎల్ అండ్ టీ సంస్థకు ఇక భవనాలు, అనుమతులు ఏవీ ఇవ్వమని కిషన్ రెడ్డి హెచ్చరించారు. భేటీ అనంతరం పలువురు బీజేపీ నేతలతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు.
ఇక ఇదే సమయంలో అయన మాట్లాడుతూ మస్లిజ్ పార్టీ పై సంచలన ఆరోపణలు చేసారు. నిజానికి హైదరాబాద్ పాతబస్తీ వరకు మెట్రో నిర్మాణం జరగాల్సి ఉందని.. కానీ పాతబస్తీ అభివృద్ది చెందడం మజ్లిస్‌కు ఇష్టం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లిస్ కుట్రలో టీఆర్ఎస్ భాగమై పాతబస్తీకి మెట్రోను దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో పాతబస్తీకి వచ్చింటే , పాతబస్తీ రూపు రేఖలు మారిపోయేవని.. కానీ కుట్రపూరితంగా మెట్రోను అక్కడిదాకా తీసుకెళ్లలేదని ఆరోపించారు. మెట్రో నిర్మాణాన్ని ఎల్&టీ అద్భుతంగా చేపట్టిందని.. ఇందుకోసం కృషి చేసిన ప్రతీ కార్మికుడికి,ఉద్యోగికి తాను కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.